యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ సాహిత్యం కథలు
రాఖీ బంధం
మాట్లాడుకోవడానికేమీ దొరక్కపోతే మా పాత పంతుళ్ళ మీదనో, కాలేజీలో బీటేసిన అమ్మాయిల గురించో, బీటేసి దెబ్బలు తిన్న అబ్బాయిల గురించో ఏవో కబుర్లతో గడిపేసేవాళ్ళం. ఆ సమయంలో ఎవరెంత ఎక్కువగా గొప్పలు చెప్తే ఆ స్టూడెంట్‌ మిగతా వాళ్ళకంటే గొప్పగా భావింపబడేవాడు. ఏమీ చెప్పక ఇన్‌ఫీరియారిటీతో ఉండకూడదనుకొని ఏదొకటి చెప్పేసో, ఏదొకటి చేసేసో తన అస్తిత్వాన్ని నిరూపించేసుకోవాలనుకొనే వాళ్ళలాగానే నేనూ ఆలోచించే వాణ్ణి.

రాఖీపండుగ ఇంకా రెండు మూడు రోజులు ఉందనగానే పోస్టులో రాఖీలు ప్యాక్‌లు వచ్చేవి. అవన్నీ ఉత్తరాలతో పాటు మా హాస్టల్‌లో ఉన్న లెటర్స్‌ బాక్స్‌లో వేసేసి వెళ్ళిపోయే వాడు మా పోస్ట్‌మాన్‌. భోజనాలకొచ్చినపుడు ఎవరికొచ్చినవాటిని వాళ్ళం తీసుకునే వాళ్ళం.

ఇంటి దగ్గర ఎలా ఉన్నా గాని అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని ఇంతింతై వటుడింతై చేసి చెప్పేవాళ్ళూ ఉండేవాళ్ళు. అయ్యో ... ఎక్కడున్నా ఈ రోజుకి మాత్రం మా ఇంటికెళ్ళిపోయి మా చెల్లి చేతనే కట్టించుకొనే వాణ్ణి రాఖీని! అని ఒకడంటే, రాఖీ కట్టించుకొని రేపొస్తా నని ఫస్్ట‌ సెమిస్టర్‌లోనే ఇంటికెళ్ళి పోయేవాడు మరొకడు. రాఖీ పండగ వాతావరణం ఇలా ఉండేది.

మా యూనివర్శిటీ హాస్టళ్ళలో అన్నా చెల్లెళ్ళ అనురాగ బంధాన్ని గుర్తు చేసుకునే గొప్ప పండుగ రాఖీ గురించి అలా మొహం తెల్లబోయి చూస్తుంటే, నన్ను మా ఫ్రెండ్స్‌తో పాటు మిగతా వాళ్ళూ వింతగా చూస్తుండటంలో ఆశ్చర్యం లేదు. పాష్‌ కల్చర్‌కి నెలవైన ఈ యూనివర్శిటీ స్టూడెంట్స్‌ అంటే ఆ మాత్రం లేకపోతే ఎలాగలే అని సరిపెట్టేసుకుందామనీ అనుకొనే వాణ్ణి.

కానీ నాలో ఏదో సంఘర్షణ... వెనుకుబాటుతనంలా కన్పించే అవమానపు నీడలు... నేనూ మీ కేమీ తీసి పోలేదని రుజువు చేసుకోవాలనే తపన. ఏదో నన్ను పట్టుకొని కుదిపేస్తుంది. దాని గురించే నా ఆలోచన.

రాఖీ పండగ రానే వచ్చింది. మా ఫ్రెండ్స్‌లో అందరికంటే అందమైన రాఖీ నాచేతికి కన్పించే సరికి వాళ్ళకి కొంత అసూయే కల్గింది. చెప్పలేదే ... నీకూ చెల్లె ఉందనీ రాఖీ పంపిస్తుందనో, పంపించిందనో అని అడిగారు. చిరునవ్వు నవ్వాను. అదో పెద్ద విజయం సాధించినంత తృప్తి కల్గింది.
(మూలం - వెబ్‌దునియా)
1| 2| 3| 4| 5| 6| 7
 
మరిన్ని...
సిన్నోడి సేద్యం (మూడో భాగం)
సిన్నోడి సేద్యం (రెండో భాగం)
సిన్నోడి సేద్యం (మొదటి భాగం)
సర్వేజనా సుఖినోభవంతు-1
పాప కోసం...
ప్రేమ పిచ్చోడు
దర్శనం
ధార్మిక కథనాలు - అన్ని రకాల సుఖ, సంతోషాలకు మూల కారణం సంతృప్తిగా నిర్వచించారు మన పెద్దలు.
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
విదేశాలకు వెళ్లేందుకు శిల్పకు సుప్రీం ఓకే
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి విదేశాలకు వెళ్లేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం అనుమతినిచ్చింది.
కేన్స్ చిత్రోత్సవాలకు అభిషేక్‌తో పాటు ఐష్
నకిలీ పాస్‌పోర్టు కేసులో మోనికాకు బెయిల్ మంజూరు
ఆరోగ్యం
పెరటి వైద్యం - కొబ్బరిని మనం దినచర్యలో తరచుగా ఏదో ఒక దానికి ఉపయోగిస్తూనే ఉంటాం.
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace