యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ సాహిత్యం కవితలు
ఓడ్ టు ఆర్ఫన్స్
- సంకలనం: మధురాంతకం మహేంద్ర
నిలువనీడలేనివాళ్ళు
నీడలు వెలివేసినవాళ్ళు
నీడలేని మ్రోళ్ళువాళ్ళు
నీళ్ళు లేని నదులువాళ్ళు

కాయాలనుగాయాలకు
దేహాలను స్వేదానికి
జీవితాన్ని పరిశ్రమకు
కామితాల్ని స్వప్నాలకు
అహుతి చేశారు

తలలన్నీ దాస్యానికి
తాకట్టుబెట్టారు
సగము నశించిన శరీర అంగాల్
చాలీచాలని చినిగిన వస్త్రాల్
తారు రోడ్డునే థార్ ఎడారిలో
ప్రతివాడిముందూ చేయిచాస్తూ
అసహనాలకూ ఏవగింపులకూ
వెక్కిరింపులకూ ఎకసెక్కాలకూ
గురై బలై కూడుగుడ్డాగూడూ కరువై

శరీరమంతా ఎముకలగూడై
కనీసమైన సుఖాలకోసం
బతకడానికో స్వప్నంకోసం
ఆక్రందించే ఆక్రోశించే
పక్షుల్లారా భిక్షుల్లారా
యోగుల్లారా రోగుల్లారా
ఆమరణాంతం అనుక్షణమూ
బ్రతికి చచ్చే శవాల్లారా

నిప్పులకుంపటి మీ బతుకు
వ్యధల సంపుటి మీ బతుకు
బాధామయ కుటి మీ బతుకు
క్షణక్షణానికీ
దినదినానికీ
చివికీ చివికీ చివరికి చినుగు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
భాగ్యనగర్ భిక్షగాడా!
కవిత్వం మత్తులో...
ఓం
టైంబాంబ్
ఆకాశం
ప్రవాళాగ్ర కోయిలా
భవిష్యత్
వాస్తు - మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి.
ఇంకా చదవండి|మరిన్ని...
సాహిత్యం
AP
 
కుక్క పిల్ల... సత్తిరెడ్డి
కోడిపుంజు అరుపుతో ఆ కుగ్రామంతోపాటు సత్తిరెడ్డి మేలుకున్నాడు. అయితే తన పక్కలో వెచ్చగా ఏదో...
భర్తలో మార్పు కోసం
ఇదిగో ఇది నా కలం
భవిష్యత్
తారాఫలం - బాల నటుడిగా వెండి తెరకు పరిచయమైన తరుణ్ అలనాటి నటి రోజా రమణీ, దర్శకనిర్మాత, నటుడు చక్రపాణి...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace