|
| ఎగిరిపోయే చకోరాలు | |
మబ్బుల బయళ్ళలో వెన్నెల సరస్సులా వుంది భూమి ఒడ్డున తొంగి చూస్తున్ననేను చంద్రిక కోసం హృదయాన్ని సరసులో కొదిలాను గాలంలా చంద్రిక హృదయానికి చిక్కేవేళకు హృదయం సరసులో కరిగిపోయింది ఓ వెన్నెలగీతం రాద్దామని రాత్రంతా వేచాను చివరకు యిక అందదనుకున్న నీలిక మా మల్లె పందిరిపైవంగి నా పరుండిన మంచంపై వాలి నా పూపెదవుల్ని చుంబిస్తున్నవేళ గాలికి చెదరిన తీగెలు ముంగురులై తమనుఖం మీద ముసురుకుంటున్న క్షణం ఆమె మెడలోని మంచి ముత్యాలమాల నా హృదయ తలంపైన మత్తుగా దొర్లుతున్నవేళ రసాభాస చేయలేక పోయాను. పక్షులను పట్టుకుందామని వలవేస్తే పక్షులు వలనెగరేసుకు పోతున్నాయి పైకి చూస్తూ నేలమీద పరిగెత్తుతూ నేను విచిత్రంగా సంగీతం పలుకుతోంది మనస్సు మృదంగంలా లయబద్దంగా......
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| కవితలు - వెలుగురేఖ రైలు చుక్కై
ఆకాశంలోకి ఎగిరిపోయిందో... |
| |
|
|
|
|
|
|
|