|
| చీకటిపాట | |
చీకటిని తనివితీరా తాగుతాను. కళ్ళకు చీకటి ఆరోగ్యం. చీకటిలో ప్రశ్నల్లేవు. తగాదాల్లేవు. వెలుగులో ఉన్న సమస్య చీకట్లోలేదు. ఓ వెలుగురేఖా - ఈ చీకటిలోకి దూసుకురాకు -
ఓ దీపమా - ఒక ప్రశ్నార్థకంలా, వెలగకు - ప్రశ్నల పేరుతో మనిషి పైకి దాడిచేసే దీపావళికి సమాధానం - తూరుపు తోపుల్లోంచీ ముసిరివిసిరే ఈదరగాలే|
ఓ వెలుగురేఖా - సూర్యుడు కిరణాలకటకటాల వెనక ఖైదు చేస్తున్న ప్రజల్ని ఈ చీకటి తీరాలకు పరిచయం చేయనియ్యి - ఈ తమ స్సముద్రాలను విడిచిపెట్టు - ఈ సమస్యేదో తేలేవరకూ నీ పడవల్ని యిటు తీసుకురాకు - పొగా, మండే ఎర్రటి వేడీ వున్న ఆ నూనె దివిటీలను యిటు తీసుకురాకు - ప్రశ్నల బాణాలు సంధిస్తూ నీ నేత్రధనస్సును నా పై గురిచేయకు - నీ కనురెప్పల డప్పులు వాయించి నా ఏకాంతపు నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టకు - ఏమైనా కానీ - ఈ చీకటిని నీ వెలుగు కత్తితో పొడిచి చంపకు -
నీ ఆకతాయి దీపాలతో ఈ నిశ్శబ్ద నీరవ దేవాలయంలో చిందులు వేయించకు - రంగురంగులదీపాల బ్యాండు మేళం వాయించకు-
చీకటిలో ఒక రాగముంది, కాదు - చీకటిలోనే రాగముంది అనేకరాగాలకు; అన్ని రాగాలకూ, అదే మాతృక - నిజానికి చీకటి వెలుతురుకే భూమిక - చీకటి వెలుగుల కలయికే వెన్నెల - అనేక వెలుతురుల కూడలి, అనేకరాగాల సంధి, చీకటి విశ్వానికి తల్లి - ఆకాశపు నల్లబల్లపైన రాసిన అక్షరాలే నక్షత్రాలు - పై కప్పు నుంచీ వ్రేలాడుతున్న ఎలక్ట్రిక్ బల్బు సూర్యుడు - దాన్ని ఆర్పి దీన్ని చెడిపి, చీకట్లో ఈ ఏకాంత పాఠాన్ని నేర్చుకో - ఓ నిశ్శబ్ద గీతాన్ని పాడుకో - తమస్ మహాదేవతోపాసన చేయి - ధ్యానంతో నాట్యం నేర్చుకో -
నేను నిశ్శబ్దంగా వున్నా - వినిపిస్తోందా| నేను చీకట్లో వున్నా - కనిపిస్తోందా|
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| షూటింగ్ ముచ్చట్లు - శ్రీకాంత్ హీరోగా, మీరా జాస్మిన్, రీమా సేన్ హీరోయిన్లుగా ప్రేమ్ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| కవితలు - వెలుగురేఖ రైలు చుక్కై
ఆకాశంలోకి ఎగిరిపోయిందో... |
| |
|
|
|
|
|
|
|