|
| జంక్షన్ - 5 | |
రైలు ఈ స్టేషనులో బయల్దేరినపుడే మరుసటి స్టేషనులో గ్రీన్ సిగ్నల్ వెలిగింది. ఆ రైలు పరిగెత్తుతూనే వుంటుంది. ఏ పక్షి రోజూ దర్శనం చేసుకునేదో టెలిఫోను తీగలపై ఆ పక్షి ఒకనాడు కన్పించడం మానేస్తుంది - స్టేషను పార్కులో రోజూ రోజాలను పూచే రోజా మొక్క మరో జాజి కొమ్మకు తావిస్తుందొకరోజు. రోజూ స్టేషనులో చాయ్ అమ్మే ముసలివాడి స్థానంలో మరో పసివాడు కన్పిస్తాడు. అదే టీ పాట్‌తో - పట్టాలపై పరిగెత్తే రైలు పరుగు తన పథాన్ని దాటి పోవడానికేనని ప్రయాణీకునికి తెలియదు.
పోస్ట్ చేయబడ్డ వుత్తరాలు రైలు పెట్టెలోని అరల్లోకి చేరిపోయాయి - ఆగిన స్టేషనులోంచీ బంట్రోతు తపాల సంచీ పట్టుకెళ్ళాడు వూర్లోకి.
నా అడ్రస్సునూ నా ప్రాణాన్నీ గుప్పెట్లో పెట్టుకొని ఊరంతావెదికాను. కానీ వెదికింతర్వాత తెలిసింది నా అడ్ససు ఆ వూర్లో లేదని.
మళ్ళీ ఎగురుకొచ్చాను గాలి వాలులో ఒక ఎండుటాకులా ప్లాట్‌ఫారంపైకి - మళ్ళీ వచ్చింది వెలుగురేఖ ఆశాదీపవాహిక పరుగెత్తే జీవ జ్వాలిక, రైలు, నా సమాంతర చూపుల పట్టాలపైకి నిజానికి రైలు వొక పరుగెత్తే వాక్యం విశ్వపథకుని చూపు
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| తారాఫలం - స్పిన్ అనే పదానికి మురళి అని అర్ధం వస్తుందని విశ్వసించే స్థాయికి లక్షల సంఖ్యలో క్రికెట్... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| కవితలు - నా అంతరంగ విశ్వంలో
ఊహలు అంతరాళాన్ని నింపేస్తాయి.
జ్ఞాపకాలు సముద్రాలై మనసును ముంచేస్తున్నాయి. |
| |
|
|
|
|
|
|
|