|
| ఓదా గాంధి రెండో భార్య కుమారుడు కరంచంద్ | | - యిమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు |
|
తమ కుటుంబాల్లోని అనుబంధాలు... ఆత్మీయతల గురించి గాంధీజీ ఇలా చెప్పారు...
"నలుగురు పిల్లలు పుట్టిన తర్వాత మొదటి భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్న ఓదా గాంధికి మరో ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే వారు వేర్వేరు తల్లి పిల్లలన్న విషయాన్నినేను చాలా కాలం వరకు తెలుసుకోలేకపోయాను. బయటివారు వేలెత్తి కూడా చూపలేనంత అన్యోన్యంగా ఆ కుటుంబ వాతావరణం సాగింది. రెండో భార్య ద్వారా ఆయనకు కలిగిన ఐదో సంతానమే కరం చంద్ గాంధి. మా నాన్న గారైన ఆయన సబా గాంధిగా అందరికీ పరిచయమయ్యారు. ఆరో సంతానం తులసీదాస్ గాంధి. వీరిద్దరూ ఒకరి తర్వాత ఒకరుగా పోర్బంధర్ దివాన్లుగా పనిచేశారు. మా నాన్న అప్పట్లో ప్రముఖంగా వెలుగొందిన రాజస్థానీ సభలో సభ్యుడిగా వ్యవహరించారు. అప్పట్లో సంస్థానాధీశులను, వారి వంశస్థుల మధ్య ఏర్పడే విభేదాలను సామరస్యంగా పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ఈ సభ తర్వాతి కాలంలో ప్రాశస్త్యాన్ని కోల్పోయింది." అని గాంధీజీ తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|