|
| కేశ సంరక్షణకు ఉసిరి మేలు | |
భారతీయ సౌందర్యా సాధనాలలో అనాదిగా వస్తున్న వాటిలో ఉసిరి ముఖ్యమైనది. దీనిలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. అతి చౌకగా, విరివిగా లభించే ఉసిరిలో ఔషధగుణాలు కూడా ఎక్కువగానే ఉండటంతో ఇది అందానికే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
ఉసిరికాయను, ఎండించి కొట్టిన పొడి ఒక స్పూన్ తీసికుని కొద్దిగా బెల్లం కలిపి ప్రతిరోజూ 1-2 సార్లు తింటూ ఉంటే జుట్టు ఊడుట, తెల్లబడుట వంటి సమస్యల నుంచి విముక్తి పొందగలరు.
కొందరికి నొటి చివరి బాగాలు పగిలి అంద విహీనంగా కనిపిస్తారు. ఇటువంటి వారు రోజు కొక ఉసిరి చొప్పున తింటుంటే సమస్య జటిలం కాకుండా ఆపి, క్రమక్రమంగా తగ్గిస్తుంది. నోటి పూత, నాలుక మంట తదితర సమస్యలకు సైతం ఉసిరి బాగా పనిచేస్తుంది.
ఒక కప్పు కొబ్బరి నుండి తీసిన పాలలో ఒక స్పూన్ ఉసిరి రసము కలిపి, ప్రతిరోజూ రెండు, మూడు సార్లు వారము రోజుల పాటు తీసుకుంటే కడుపులో పురుగులు (నులి, బద్దె, కొంకి, ఏలిక) నశిస్తాయి.
ఒక స్పూన్ ఉసిరి రసంలో అంతే బొప్పాయి పాలు కలిపి, కొద్దిగా పంచదార కూడా కలిపి, రోజుకి 2-3 సార్లు తీసుకుంటుంటే విరేచనాలు, కడుపునొప్పి లాంటివి తగ్గిపోతాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| పెరటి వైద్యం - గుమ్మడి కాయ వంటల్లో వండుకోవడానికి మాత్రమే కాకుండా కడుపులో ఏర్పడే అసౌకర్యం నుంచి.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - యువకుడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భూమికా చావ్లా అనతికాలంలోనే భూమికగా తెలుగు... |
| |
|
|
|
|
|
|
|