|
| రాగి రంగు జుట్టు నల్లగా నిగనిగలాడాలంటే..... | |
నల్లని ఒత్తైన జుట్టు ఆడవారికి మరింతగా అందాన్ని చేకూరుస్తాయి. అందుకే తమ అందానికి ప్రతిరూపమైన నల్లని నిగనిగలాడే జుట్టుకోసం ఆశపడని స్త్రీలు ఉండరంటే అతిశయోక్తి కాదు. కాని కొందరికి వెంట్రుకలు రాగి రంగులో నిర్జీవంగా ఉంటాయి. అలాంటి వారు నల్లని జుట్టు పొందడానికి చేయని ప్రయత్నమంటూ ఉండదు.
అందుకే మీరూ నల్లని కురులను సొంతం చేసుకోవాలనుకుంటే ఈ సలహాలు పాటించి చూడండి. నల్లగా నిగనిగలాడే అందమైన కురులు మీ సొంతమౌతాయి.
ఉద్దిపప్పు ఒకటిన్నర టీ స్పూను, 15వరకు వేపాకులను తీసుకుని వీటిని పుల్లటి మజ్జిగలో నానపెట్టండి. అటుపై ఈ మిశ్రమాన్ని మెత్తగా రుబ్బాలి. ఇలా తయారు చేసిన పేస్టును తలకు పూర్తిగా పట్టించి, బాగా ఆరిన తర్వాత తలస్నానం చేయండి.
ఈ విధంగా 10 నుంచి 15 రోజుల వరకు క్రమం తప్పకుండా చేస్తే రాగిరంగు జుట్టు క్రమంగా నల్లబడి మీరు కోరే అందమైన కురులు మీ సొంతమౌతుంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| తారాఫలం - భారత టెస్ట్ క్రికెట్ క్రీడాకారుల్లో అత్యధిక వికెట్లను పడగొట్టిన అనిల్ కుంబ్లే ప్రపంచ వ్యాప్తంగా... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| కవితలు - యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా
పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో... |
| |
|
|
|
|
|
|
|