యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం పెరటి వైద్యం
వంటతో పాటు వైద్యంలో కూడా కొబ్బరి కీలక పాత్ర
- సంకలనం: దుర్గాభవాని
కొబ్బరిని మనం దినచర్యలో తరచుగా ఏదో ఒక దానికి ఉపయోగిస్తూనే ఉంటాం. కొబ్బరిని వంటలో అనేర రకాలుగా వాడుతుంటాం. అయితే కొబ్బరి ఆహారానికి రుచిని అందించడంతో పాటు వైద్యానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది.

కొబ్బరిలో విటమిన్ ఈ, బీ, సీలు పుష్కలంగా లభిస్తాయి. అంతే కాకుండా కాల్షియం, ఐరన్, పాస్ఫరస్ వంటి ఖనిజాలు, ఇతర మినరల్స్‌ను కూడా కొబ్బరి కలిగి ఉంది. కొబ్బరిలో అత్యధిక శాతం ఆల్కేన్ ఆయిల్ కూడా ఉంది. అయితే కొబ్బరిలో కొవ్వు కూడా అధిక శాతంలో ఉంది. కొబ్బరిలో లభించే ప్రొటీనులు కూడా అధిక నాణ్యతను కలిగి ఉంటాయి.

కొబ్బరి తేలికగా జీర్ణమవ్వడమే కాకుండా, మంచి పోషక విలువలను కూడా శరీరానికి అందిస్తుంది. రక్తవృద్దికి సైతం కొబ్బరి ఎంతో తోడ్పడుతుంది. ప్రతిరోజూ కొబ్బరిని నమలడం వల్ల నోటి క్యాన్సర్‌ను నివారించవచ్చు. గర్భవతిగా ఉన్నప్పుడు మహిళలు రెగ్యులర్‌గా కొబ్బరి తీసుకుంటే పుట్టే పాప ఆరోగ్యవంతంగా ఉండడమే కాక, సుఖప్రసవం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

అంతేకాకుండా కొబ్బరినీటిని ప్రతిరోజూ చిన్నపిల్లలకు తాగిస్తే వారు ఆరోగ్యంగా ఉంటారు. అల్సర్, సరిగా జీర్ణం కాకపోవడం, మలబద్ధకం, పొత్తి కడుపు నొప్పితో బాధపడేవారు కొబ్బరినీరు సేవిస్తే ఉపశమనం లభిస్తుందనడంలో అతిశయోక్తిలేదు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
క్యారెట్‌ రసంతో ముడతలు మాయం
తేనెతో లాభాలెన్నో...3
తేనెతో లాభాలెన్నో...2
తేనెతో లాభాలెన్నో...
పసుపుతో గాయాలు మటుమాయం
క్యారెట్ రసంతో తేనె కలిపి సేవిస్తే కంటి చూపు మెరుగు
దర్శనం
ధార్మిక కథనాలు - మనసుకు ప్రశాంతత కలిగించే సాధనాలలో యోగా ముఖ్య పాత్ర పోషిస్తోంది.
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
విదేశాలకు వెళ్లేందుకు శిల్పకు సుప్రీం ఓకే
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి విదేశాలకు వెళ్లేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం అనుమతినిచ్చింది.
కేన్స్ చిత్రోత్సవాలకు అభిషేక్‌తో పాటు ఐష్
నకిలీ పాస్‌పోర్టు కేసులో మోనికాకు బెయిల్ మంజూరు
ఆరోగ్యం
పెరటి వైద్యం - ప్రతిరోజు క్యారెట్ రసం సేవిస్తే చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. క్యారెట్‌లో ఉండే బీటా...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace