|
| తేనెతో లాభాలెన్నో...3 | |
తేనె చర్మ వ్యాధుల నుంచి కూడా నివారణ కలిగిస్తుంది. అంతే కాకుండా చర్మ సంరక్షణకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. చర్మంపై తగిలిన గాయాలకు (కత్తిగాట్లు, కాలిన మచ్చలు) తరచుగా తేనె రూస్తూ ఉంటే గాయం తగ్గడమే కాకుండా ఆ మచ్చ కూడా కనిపించదనడంలో సందేహం లేదు. తేనే ముఖ వర్చస్సును కూడా మెరుగు పరుస్తుంది.
తేనె, పసుపు, శెనగపిండి కలిపి ఫేస్‌ప్యాక్‌లా వేసుకుని 15- 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుగుకుంటే చర్మకాంతి పెరగడమే కాకుండా వయసుతో వచ్చే ముడతలు కూడా తగ్గుతాయి. నిమ్మరసంలో తేనె కలిపి ముఖం, మెడ, చేతులకు పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే కాలుష్యం వల్ల పేరుకున్న మురికి తొలగి పోవడమే కాకుండా చర్మం మంచి నిగారింపు సంతరించుకుంటుంది.
రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో ఓ టీస్పూన్ తేనె కలిపి సేవించాలి. తేనె శరీరానికి శక్తి కూడా ఇస్తుంది. నెయ్యిలో వేయించిన ఇంగువలో ఓ టేబుల్ స్పూన్ తేనె కలిపి రోజుకు మూడు సార్లు సేవిస్తే జీర్ణశక్తి మెరుగవడమే కాకుండా శరీరాన్ని రోజంతా ఉల్లాసవంతంగా ఉంచుతుంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - అల్లం రసం, తేనె సమపాళ్లలో తీసుకుని రోజుకు రెండు, మూడు సార్లు తీసుకుంటే... |
| |
|
|
|
|
|
|
|