యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం పెరటి వైద్యం
తేనెతో లాభాలెన్నో...
- సంకలనం: దుర్గాభవాని
సహజ సిద్ధంగా లభించే తేనెతో ఆరోగ్యంతో పాటు, అందానికి కూడా ఎన్నో లాభాలున్నాయి. దేవుడికి అభిషేకం చేసే పంచామృతాల్లో కూడా తేనె విశిష్ట స్థానం సంపాదించింది. ప్రతిరోడు వేడి నీటిలో తేనె వేసి సేవిస్తే ఆ రోజంతా ఎంతో తాజాగా, ఉత్సాహంగా ఉంటుంది. గొంతు నొప్పితో బాధపడేవారు వేడినీరు లేదా పాలతో తేనె కలిపి సేవిస్తే వెంటనే ఉపశమనం లభిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

ఓ గ్లాసు గోరువెచ్చని నీటిలో అరచెక్క నిమ్మరసం పిండి దానికి రెండు టీస్పూన్ల తేనె కలిపి సేవిస్తే గొంతునొప్పి తగ్గుతుంది. ఓ టీస్పూన్ తేనెలో అరస్పూన్ మిరియాలపొడి చేర్చి బాగా కలిపి సేవించినా ఫలితం కనిపిస్తుంది.

అర టీస్పూన్ సొంఠి పొడి, మూడు మిరియాల గింజలు, మూడు లవంగాలు, మూడు యాలికలు, అర టీ స్పూన్ సోంపు కలిపి నీటిలో వేసి కొద్ది సేపు మరిగించిన తర్వాత అందులో కొద్దిగా తేయాకు, తేనె కలిపి బాగా మరిగించాక గోరువెచ్చగా సేవిస్తే గొంతు నొప్పి, జలుబు, దగ్గునుంచి ఉపశమనం లభిస్తుంది. దీనిని రోజుకు రెండు లేదా మూడు సార్లు సేవిస్తే మంచిది.

తేనె కఫంను కూడా తగ్గిస్తుంది. ఎనిమిది నుంచి పది తులసాకులు, రెండు వెల్లుల్లి రేకలు, అర అంగుళం అల్లం, 4 మిరియాలు తీసుకుని బాగా దంచాలి. తర్వాత వాటిని కప్పు నీటితో చేర్చి బాగా మరిగించాలి. దీనికి తేనె కలిపి సేవిస్తే దగ్గు, జలుబుల వచ్చే కఫం నివారిస్తుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పసుపుతో గాయాలు మటుమాయం
క్యారెట్ రసంతో తేనె కలిపి సేవిస్తే కంటి చూపు మెరుగు
సర్వ రోగనివారిణి తులసి
పుదీనాతో మొటిమలు మాయం
వేసవిలో చర్మ సంరక్షణకు చిట్కాలివే
నాజూకుతనానికి తోటకూర
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
విదేశాలకు వెళ్లేందుకు శిల్పకు సుప్రీం ఓకే
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి విదేశాలకు వెళ్లేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం అనుమతినిచ్చింది.
కేన్స్ చిత్రోత్సవాలకు అభిషేక్‌తో పాటు ఐష్
నకిలీ పాస్‌పోర్టు కేసులో మోనికాకు బెయిల్ మంజూరు
ఆరోగ్యం
పెరటి వైద్యం - పసుపుతో గాయాలు మటుమాయమవుతాయి. కత్తిగాట్లు పడిన సమయంలో గాయంపై పసుపు...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace