|
| పసుపుతో గాయాలు మటుమాయం | |
పసుపుతో గాయాలు మటుమాయమవుతాయి. కత్తిగాట్లు పడిన సమయంలో గాయంపై పసుపు అద్దితే రక్తస్రావం తగ్గుతుంది. ఫ్లూ జ్వరం, దగ్గు, జలుబు వంటి వాటికి పసుపు మంచి నివారణగా ఉపయోగపడుతుంది. ఆ సమయంలో పసుపును తేనెతో గానీ, పాలతో కానీ కలిపి సేవిస్తే వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది.
పసుపు రోగనివారిణిగానే కాకుండా సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. పూర్వం స్నాన సమయంలో పసుపును తప్పనిసరిగా ఉపయోగించేవారు. పెళ్లిళ్ల సమయంలో కూడా వధూవరులకు పసుపు రాస్తారు. దీని వల్ల వధూవరుల ముఖాల్లో ప్రత్యేక కళ సంతరించుకోవడమే కాకుండా దుష్ట శక్తుల గాలి సోకకుండా ఉంటుందని వారి నమ్మకం.
పసువు ఆ సమయంలోనే కాకుండా ప్రతిరోజు స్నాన సమయంలో రాసుకోవడం వల్ల చర్మం మంచి నిగారింపు సంతరించుకుంటుంది. చిన్న పిల్లలకు స్నానం చేయించేటప్పుడు సున్నిపిండితో పాటు పసుపు కూడా తప్పని సరిగా రాసేవారు. పసుపును కొబ్బరి లేదా నువ్వుల నూనెతో కలిపి రాసుకుని స్నానం చేస్తే చర్మకాంతి మెరుగవుతుంది.
పాదాల పగుళ్లను కూడా పసుపు నివారిస్తుంది. అది ఎలాగంటే రాత్రి పడుకునే ముందు పాదాలు పూర్తిగా శుభ్రం చేసుకుని పసుపులో కొబ్బరి నూనె కలిపి పగుళ్లకు రాస్తే వారం రోజుల్లో పగుళ్లు మటుమాయమవుతాయి. పగుళ్ల ఆనవాళ్లు కూడా కనిపించవంటే అతిశయోక్తి కాదేమో.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - కంప్యూటర్ల ముందు అధిక సమయం కూర్చోవటం వలన కంటి చూపు మందగించే... |
| |
|
|
|
|
|
|
|