యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం చికిత్స
ఆస్తమా నియంత్రణకు మార్గాలు
- సంకలనం: దుర్గా భవానీ
విజ్ఞానరంగం పురోగతి సాధించిన ఫలితంగా పలు రకాల వ్యాధులకు ప్రస్తుతం తగిన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో కొన్నిటికి మినహాయింపు ఉన్నప్పటికీ, చాలా వరకు రోగాలు ప్రస్తుత చికిత్స విధానాలతోనే నయమవుతున్నాయి.

అయితే అంత సులభంగా నయం కాని వ్యాధులు కూడా ఉన్నాయి. అందులో ఆస్తమాను కూడా ప్రధానంగా పేర్కొనవచ్చు. అయితే దీనిని నియంత్రించేందుకు మాత్రం ఎన్నో మార్గాలున్నాయి. ఈ మార్గాలను అవలంబించడం ద్వారా దానిని చాలా వరకు నియంత్రించవచ్చని వైద్యులు చెబుతున్నారు.

ఈ పరిస్థితుల్లో ఆస్తమా నియంత్రణకు మార్గాలను తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. పరిశుభ్రమైన గాలి, వాతావరణం ఉన్న ప్రాంతాల్లో నివసించడం మంచిది. ప్రతి రోజూ వాకింగ్ చేయడం మంచిది.

కొవ్వు సామర్థ్యం అధికంగా ఉన్న పంది మాంసం, పశు మాంసం, నూనెలో వేయించిన ఫాస్ట్ ఫుడ్స్ రకాలు, అధిక కొవ్వు కలిగిన చేపల రకాలుగా ఉన్న సొరచేప తదితరాలను స్వీకరించక పోవడం మంచిది.

అలాగే చల్లదనాన్నిచ్చే పుచ్చకాయ, బీరకాయ, థర్బూజ వంటి కూరగాయల రకాలు, ఫ్రిజ్‌లో ఉంచిన పదార్ధాలు, పెరుగు, అసిడిక్ ఆమ్లం అధికంగా ఉన్న నిమ్మ, సాత్తుకుడి, నారింజ, పుల్లగా ఉండే ద్రాక్ష వంటి పళ్ల రకాలను తీసుకోరాదు. అధిక కారం, అధిక పులుపు స్వీకరించచరాదు.

సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను స్వీకరించాలి. శ్వాస విడవటం, కడుపు నిండా తినడం జరగకూడదు. సాయంత్రం ఏడుగంటలకల్లా రాత్రి వేళ భోజనం ముగించడం మంచిది. ఆహారంలో మునగాకు అధికంగా ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది. ప్రధానంగా ఆస్తమాకు ప్రధాన కారణమైన కఫంను తొలగించేందుకు ఉపయోగపడగలదు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఆస్తమా నియంత్రణకు మార్గాలు
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
 
ప్రియుని ద్వారా అవకాశాలు : ఆయెషా టాకియా
ప్రియుని ద్వారా బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయని చెప్తోంది బాలివుడ్ నటి ఆయెషా టాకియా.
గ్లామర్ పాత్రలకు సెక్సీ క్వీన్ షకీలా టాటా
తమిళంలోనూ ఎవడైతే నాకేంటి
ఆరోగ్యం
పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace