|
| వర్కింగ్ ఉమెన్ కోసం | |
మహిళలు నేడు ఆఫీసుల్లోనే కాదు ఇతర సాంకేతిక, నైట్ షిప్టు డ్యూటీలు ఉండే ఉద్యోగాలలోనూ మగవారితో సమంగా పనిచేస్తున్నారు.
గత రెండు దశాబ్దాలతో పోల్చి చూసినప్పుడు మగువల జీవితం మహా బిజీగా మారింది. గతంలో మాదిరిగా తమ శరీరం, ఆరోగ్యంపై శ్రద్ధ చూపించటానికి సమయం ఉండటం లేదు.
దీంతో వర్కింగ్ ఉమెన్ పలు రకాల ఇబ్బందులకు గురవుతోంది. వృత్తిలో ఒత్తిడి, ఇంటి దగ్గర బాధ్యతలు చూసే మహిళలు వాటికి తగినట్లుగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రతిరోజూ ఉదయానే కనీసం ఓ అరగంటైనా నడవాలి. తమ పొరుగువారితో కలిసి వెళ్లటం మంచిది.
ఆఫీసుల్లో మధ్యలో కాఫీ బ్రేక్, లంచ్ బ్రేక్‌లలో సీటులో నుంచి లేచి అటూ ఇటూ కాసేపు తిరగాలి. సాయంత్రం వేళ అప్పుడప్పుడు పిల్లలతో కలిసి వాకింక్ వెళ్లటం అలవాటు చేసుకోవాలి.
సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ప్రశాంతత కోసం మంచి మ్యూజిక్ ను వింటూ రిలాక్స్ అవ్వటం వల్ల ఒత్తిడి, మానసిక ఆందోళన నుంచి దూరమవ్వవచ్చు. వారానికోసారి కుటుంబ సభ్యలందరూ అలా పిక్నిక్ కు వెళ్లటం వల్ల మానసికంగా ఆనందం కలుగుతుంది. మరుసటి రోజు ఉదయం ఉద్యోగానికి హుషారుగా వెళతారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|