|
| అధిక ఉప్పుతో పిల్లల ఆరోగ్యానికి ప్రమాదం: పరిశోధన |
ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలను తీసుకోవడం ద్వారా పిల్లలకు భవిష్యత్‌లో సమస్యలు వచ్చే ప్రమాదముందని కొత్తగా నిర్వహించిన పరిశోధనలు పేర్కొంటున్నాయి. అందుకే తల్లితండ్రులు ఈ విషయంలో జాగురకతతో ఉండాలని పరిశోధకులు చెబుతున్నారు.
లండన్‌లోని కొందరు శాస్త్రవేత్తల బృందం ఉప్పు- ఆరోగ్యం అనే అంశంపై జరిపిన ఈ పరిశోధన ప్రకారం పిల్లలు తీసుకొనే ఆహారంలో ఉప్పు ఎక్కువైతే వారికి భవిష్యత్‌లో రక్తపోటు వచ్చే ప్రమాదముందని ఈ పరిశోధనలు తెలుపుతున్నాయి.
అలాగే గుండెకు సంబంధించిన వివిధ సమస్యలు కూడా తలెత్తే ప్రమాదముందని ఈ పరిశోధన నిర్వహించిన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అలాగే శరీరంలో ఉప్పు పరిమాణం ఎక్కువయ్యే కొద్ది కడుపులో కేన్సర్‌కు దారితీసే ప్రమాదముందని ఈ పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
పై సమస్యల దృష్ట్యా పిల్లలు తీసుకునే పదార్ధాలలో ఉండే ఉప్పు పరిమాణంపై తల్లితండ్రులు శ్రద్ధ వహించాలని ఈ పరిశోధన నిర్వహించిన శాస్త్రవేత్తలు కోరుతున్నారు. తీపితో తయారు చేసే పిజ్జా, బర్గర్ లాంటి తినుబండారాలలో సైతం ఉప్పు పరిమాణం ఎక్కువగా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| వార్తలు - హెచ్‌ఐవీ రోగుల కోసం బ్రిటన్‌లో కొత్త ఔషధం కనిపెట్టారు. రాల్తేగ్రావిర్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ ఔషధం... |
| |
|
|
|
|
 | | WD |
| | | జెనీలియా | | ''బాయ్స్'' చిత్రంతో వెండితెరకు పరిచయమైన జెనీలియా అనతికాలంలోనే తెలుగు, తమిళం... |
|
| |
|
|
|
|
|
| టాలీవుడ్ - తరుణ్, ఇలియానాలు జంటగా నటిస్తున్న తాజా చిత్రంలో జగపతిబాబు ఓ కీలకమైన పాత్రలో కన్పించనున్నారు. |
| |
|
|
|
|
|
|
|