|
| హెచ్‌ఐవీ రోగుల కోసం బ్రిటన్‌లో కొత్త ఔషధం |
| లండన్ (ఏజెన్సీ), సోమవారం, 28 జనవరి 2008 ( 14:39 IST ) | |
హెచ్‌ఐవీ రోగుల కోసం బ్రిటన్‌లో కొత్త ఔషధం కనిపెట్టారు. రాల్తేగ్రావిర్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ ఔషధం హెచ్‌ఐవీ జన్యు పదార్థం స్థాయిని తగ్గించేలా పనిచేస్తుందని దీని రూప కర్తలు చెబుతున్నారు.
లండన్‌లోని చెల్సియా, వెస్ట్ మిన్‌స్టర్ ఆస్పత్రుల్లో హెచ్‌ఐవీ సేవల డైరక్టర్ మార్క్ నెల్సన్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎయిడ్స్ కోసం చికిత్స అందుకుంటున్న వారి జీవన పరిస్థితులను మెరుగుపరిచేందుకు ఈ ఔషధం చక్కగా పనిచేస్తుందని చెప్పారు.
తాము ట్రయల్స్ సందర్భంగా రోగులకు ఆప్టిమైజ్డ్ బ్యాక్ గ్రౌండ్ థెరపీతో పాటు ఈ ఔషధాలను అందించామని చెప్పారు. పదేళ్లుగా ఓబీటీ థెరపీ కింద ఆంటీ రిట్రోవైరల్ హెచ్‌ఐవీ ఔషధాలు వాడినప్పటికీ, ప్రయోజనం కన్పించని రోగులకు ఈ ఔషధాలతో ప్రయోగం జరిపామని తెలిపారు.
తమ పరిశోధనల ప్రకారం ఈ ఔషధం తీసుకున్న వారిలో 75శాతం రోగుల రక్తంలో హెచ్‌ఐవీ వైరల్ లోడ్ బాగా తగ్గిందని రూపకర్తలు తెలిపారని ది ఇండిపెండెంట్ పత్రిక తెలిపింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| పెరటి వైద్యం - గుమ్మడి కాయ వంటల్లో వండుకోవడానికి మాత్రమే కాకుండా కడుపులో ఏర్పడే అసౌకర్యం నుంచి.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - యువకుడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భూమికా చావ్లా అనతికాలంలోనే భూమికగా తెలుగు... |
| |
|
|
|
|
|
|
|