|
| నిత్య వ్యాయామంతో వ్యక్తుల్లో పెరిగే ఆయుర్దాయం |
నిత్య వ్యాయామంతో శరీర ధారుడ్యాన్ని పెంపోందించుకునే వారికి ఆయుర్దాయం పెరుగుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. వ్యాయామానికి దూరంగా ఉండేవారికంటే నిత్యం వ్యాయామం చేసే వారు ఎక్కువకాలం జీవిస్తారని ఈ పరిశోధనలు నిరూపిస్తున్నాయి.
వాషింగ్టన్‌లోని వెటెరన్స్ అఫైర్స్ మెడికల్ సెంటర్‌లో గల కార్డియాలజీ విభాగానికి చెందిన వ్యాయామ పరిశోధనా డైరెక్టర్లు నిర్వహించిన పరిశోధనలో ఈ విషయాన్ని తెలుసుకున్నారు. దాదాపు 15 వేల మంది వ్యక్తులపై వీరు నిర్వహించిన పరిశోధనలతో ఈ నిర్ధారణకు వచ్చారు.
ఎక్కువ శారీరక ధారుడ్యాన్ని కలిగిన వ్యక్తి తక్కువ శారీరక ధారుడ్యం కలిగిన వ్యక్తికంటే ఎక్కువకాలం జీవించే అవకాశాలు రెట్టింపు శాతం ఉన్నట్టు వీరి పరిశోధనల్లో తెలియవచ్చింది. అలాగే చాలా ఎక్కువ శారీరక ధారుడ్యం కలిగిన వ్యక్తి తక్కువ శారీరక ధారుడ్యం కలిగిన వ్యక్తికంటే అధిక కాలం జీవించే అవకాశాలు 70 శాతం ఎక్కువగా ఉందని వీరు చెబుతున్నారు.
వేగంగా నడిచే వ్యాయామాన్ని రోజుకు 30 నిమిషాలపాటు వారంలో 5-6 రోజులు చేసే వారికి అకాల మరణం సంభవించే అవకాశాలు దాదాపు సగం మేర తగ్గుతాయని ఈ పరిశోధన నిర్వహించిన పీటర్ కొకిన్సన్ అనే ప్రొపెసర్ చెబుతున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| పెరటి వైద్యం - ఇదిగో వచ్చేస్తోంది వేసవి. సంక్రాంతి చలి వెళ్లకముందు ఎండలు మండుతున్నాయి. వేసవి తాపాన్ని... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - యువకుడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భూమికా చావ్లా అనతికాలంలోనే భూమికగా తెలుగు... |
| |
|
|
|
|
|
|
|