|
| ఊబకాయ శస్త్రచికిత్సతో మధుమేహం దూరం: పరిశోధనలో వెల్లడి |
ఊబకాయం సమస్య నివారణకు చేసే శస్త్ర చికిత్సల వల్ల మధుమేహం చాలా వరుకు తగ్గిపోతోందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఊబకాయం పరిష్కారానికి శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారిలో మధుమేహం లక్షణాలు తగ్గడం ద్వారా వారు మందులు తీసుకోవడం కూడా మానివేయగలిగారని ఈ పరిశోధనలో తేలింది.
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో గల మోనాస్ విశ్వవిద్యాలయానికి చెందిన మెడికల్ కళాశాలలో నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం తెలియవచ్చిందని డాక్టర్ జాన్ డిక్సన్ తెలిపారు. వీరు నిర్వహించిన పరిశోధనల ప్రకారం ఒబెసిటీ పరిష్కారానికి చేసే కడుపు పరిమాణం తగ్గింపు ఆపరేషన్ వల్ల మధుమేహం లక్షణాలు చాలా వరకు తగ్గిపోయాయని తెలిసింది.
కడుపులోని అన్నాశయాన్ని బంధించడం ద్వారా ఆహారం తీసుకునే పరిమాణాన్ని తగ్గించగలిగే ఈ శస్త్ర చికిత్స వల్ల కాలక్రమేనా ఊబకాయం సమస్యనుంచి బయట పడవచ్చు. అయితే ఈ శస్త్ర చికిత్స చేయించుకున్న వారిలో బరువు తగ్గడంతో పాటు మధుమేహం లక్షణాలు కూడా తగ్గిపోయినట్టు రక్తపరీక్షల్లో నిర్ధారణ అయ్యిందని వారు తెలిపారు.
ఊబకాయం తగ్గించుకోవడానికి స్టమక్ బ్యాండ్ సర్జరీ, గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ లాంటి శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారిలో దాదాపు రెండేళ్లలో మధుమేహం లక్షణాలు సాధారణ స్థితికి రావడంతో అందుకోసం వాడే ఔషధాలను కూడా వారు మానివేయగలిగారని పరిశోధనలో పాల్గొన్న డాక్టర్లు నిర్ధారించారు.
అయితే మధుమేహ నిపుణులు మాత్రం ఈ అభిప్రాయాలతో విభేదిస్తున్నారు. మధుమేహ వ్యాధి కలిగిన కొందరిపై జరిపిన ఈ పరిశోధనల వల్ల పూర్తి నిర్ధారణకు రాకూడదని వారు చెబుతున్నారు. మధుమేహం దీర్ఘకాలికమైనదని, దీని విషయంలో కొన్ని ఉదాహరణలతో నిర్ధారణకు రాకూడదని వారు అంటున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| వాస్తు - గృహ నిర్మాణం అనేది ఒకటి రెండు రోజుల్లో జరిగే పని కాదు. కావున గృహ నిర్మాణ సమయంలోనే... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - సూపర్ చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన అనుష్క తొలి చిత్రంతోనే మంచి... |
| |
|
|
|
|
|
|
|