|
| కాఫీతో అండాశయ కాన్సర్ దూరం: పరిశోధనలో వెల్లడి |
రోజూ మూడు కప్పుల కాఫీని తీసుకోవడం ద్వారా మహిళలకు భవిష్యత్‌లో అండాశయ కాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని లండన్‌లో నిర్వహించిన ఓ వైద్య పరిశోధనలో తేలింది.
లండన్‌లోని ఓ వైద్య బృందం నిర్వహించిన పరిశోధన ప్రకారం రోజుకు కనీసం మూడు కప్పుల కాఫీని తాగే స్త్రీలలో గర్భాశయ కాన్సర్ వ్యాధి సంక్రమించినా దాని పెరుగుదల కాఫీని తాగని వారితో పోల్చితే 20 శాతం తక్కువగా ఉన్నట్టు కనుగొనబడింది. కాఫీలోని కెపీన్ ఏ విధంగా అండాశయ కేన్సర్‌ని ఎదుర్కుంటుందో ఈ పరిశీలనలో నిర్ధారణకు రాకపోవడం విశేషం.
ఈ వైద్య బృందం 1976 -2004 మధ్య కాలంలో దాదాపు 80,000 మంది స్త్రీల ఆహార అలవాట్లపై పరిశోధన నిర్వహించింది. ఈ పరిశోధనా కాలంలో వీరిలో 737 మందికి గర్భాశయ కేన్సర్ సంక్రమించగా వారిలో కాఫీ సేవించే వారికి కేన్సర్ ప్రభావం తక్కువగా ఉన్నట్టు తేలింది.
కానీ ఇటీవలే లండన్‌లోని మరో వైద్య బృందం కాఫీ సేవనం వల్ల స్త్రీలలో గర్భస్రావం కలిగే అవకాశాలు ఎక్కువవుతాయని పేర్కొనడం గమనార్హం. ఈ రెండు పరిశోధనల ఫలితాలు ఎలా ఉన్నా కాఫీ అతి సేవనం మాత్రం ఆరోగ్యానికి అనర్ధమేనని వైద్యులు అభిప్రాయ పడుతున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| వాస్తు - గృహ నిర్మాణం అనేది ఒకటి రెండు రోజుల్లో జరిగే పని కాదు. కావున గృహ నిర్మాణ సమయంలోనే... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - సూపర్ చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన అనుష్క తొలి చిత్రంతోనే మంచి... |
| |
|
|
|
|
|
|
|