యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం వార్తలు
కాఫీ సేవనంతో గర్భస్రావం జరిగే ప్రమాదం: పరిశోధనలో వెల్లడి
కాఫీ సేవనంతో గర్భస్రావం జరిగే ప్రమాదం ఉందని వైద్య పరిశోధనలో వెల్లడైంది. అందుకే గర్భవతులు కాఫీ తీసుకోవడాన్ని మానేయడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు.

ప్రతిరోజు రెండు కప్పుల కాఫీ తీసుకునే గర్భవతుల్లో గర్భస్రావం జరిగే ప్రమాదం రెండింతలు ఎక్కువగా ఉందని వైద్య పరిశోధనలు నిరూపిస్తున్నాయి. గర్భం ధరించిన మొదటి మూడు నెలల్లో కాఫీని తీసుకోవడం వల్ల ఈ ప్రమాదం మరింత ఎక్కువని ఈ పరిశోధనలు తెలుపుతున్నాయి. కాబట్టి గర్భం ధరించిన ప్రారంభంలో కాఫీని పూర్తిగా మానివేయడం మంచిదని పరిశోధకులు చెబుతున్నారు.

బ్రిటన్‌లోని 1,063 మంది గర్భవతులపై జరిగిన ఓ పరిశోధనలో పై విషయాలు వెల్లడైందని వారు తెలిపారు. రోజుకు దాదాపు 200 మిల్లీ గ్రాముల కెఫీన్‌ కలిగిన కాఫీ ఉత్పత్తుల్ని తీసుకునే వారిలో గర్భస్రావం జరిగే ప్రమాదం 25 శాతంగా ఉందని ఈ పరిశోధనల్లో తెలిసింది. అయితే కెఫీన్‌తో కూడిన ఎటువంటి పదార్ధాలను తీసుకోని వారిలో గర్భస్రావం జరిగే అవకాశాలు 12 శాతం మాత్రమే ఉందని ఈ పరిశోధనల్లో తేలింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వ్యాధులను దరిచేర్చే షేక్ హ్యండ్ అలవాటు
హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త సహాయ పథకం
ధుమపానంతో మెదడుకు చేటు
జనవరి 6న తొలి విడత పోలియో చుక్కలు
అత్యుత్తమ వైద్య సదుపాయం: అగ్రస్థానంలో చెన్నై
కరచాలనం కంటే చుంబనమే మేలట...!
భవిష్యత్
వాస్తు - గృహ నిర్మాణం అనేది ఒకటి రెండు రోజుల్లో జరిగే పని కాదు. కావున గృహ నిర్మాణ సమయంలోనే...
ఇంకా చదవండి|మరిన్ని...
సాహిత్యం
AP
 
సంక్రాంతి పూబంతిని చేరుకున్న చిన్నోడు
సంక్రాంతి పండుగ సందడిలో అక్కడి వాతావరణం మహా హుషారుగా ఉంది. అయితే అమెరికా...
కుక్క పిల్ల... సత్తిరెడ్డి
భర్తలో మార్పు కోసం
భవిష్యత్
తారాఫలం - సూపర్ చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన అనుష్క తొలి చిత్రంతోనే మంచి...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace