యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం వార్తలు
వ్యాధులను దరిచేర్చే షేక్ హ్యండ్ అలవాటు
ఇతరులను కలిసినప్పుడు వారిని మనం షేక్ హ్యాండ్(కరచాలనం)తో పరిచయం చేసుకోవడం అలవాటుగా వస్తోంది. అయితే మనం ఇచ్చే ఈ షేక్ హ్యండ్ మనకు వ్యాధులను తెచ్చి పెడుతుందని తెలిస్తే ఆశ్చర్యంతో పాటు నిజమేనా అని అనిపించక మానదు.

లండన్‌కు చెందిన హైజైయిన్ స్కూల్లో ప్రొఫెసర్ బ్లూమ్‌ఫీల్డ్ ఈ విషయంపై జరిపిన పరిశోధనల్లో షేక్ హ్యాండ్ వల్ల వ్యాధులు వస్తాయని తెలిసింది. షేక్ హ్యాండ్ ద్వారా వ్యాధి కారక సూక్ష్మక్రిములు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతాయని ఈ పరిశోధనలో తేలింది. షేక్ హ్యాండ్ ఇచ్చే సందర్భంలో ఫ్లూ, కడుపునొప్పికి కారణమైన సూక్ష్మక్రిములు ఒకరినుంచి ఒకరికి వ్యాప్తి చెందుతాయని ఈ పరిశోధనలో ద్వారా నిరూపించారు.

ఇతరులతో పరిచయం చేసుకునే సమయంలో షేక్ హ్యాండ్ కన్నా చెక్కిలిపై ముద్దు పెట్టుకోవడమే మంచిదని ఈ పరిశోధన నిర్వహించిన శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎందుకంటే ముద్దు ద్వారా వచ్చే వ్యాధుల కన్నా షేక్ హ్యండ్ ద్వారానే అధికంగా వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఈ పరిశోధనలో తేలింది.

మనకు షేక్ హ్యాండ్ ఇచ్చిన వ్యక్తి అంతకుముందు అదే చేతితో అనేక పనులు నిర్వహించి ఉండవచ్చు. ఆ సమయంలో ఆ వ్యక్తి చేతికి అంటుకున్న రోగకారక క్రిములు మనకు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మన చేతికి అంటుకుని తద్వారా వ్యాధులు కలిగే అవకాశముందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.

కాబట్టి చేతితో చేసే పనులు పూర్తయ్యాక వాటిని శుభ్రంగా కడుక్కొవాలి. వీలైతే ఆల్కహాలతో తయారైన హ్యాండ్ వాష్‌లను ఉపయోగించడం ద్వారా మనకు, ఇతరులకు వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్త పడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త సహాయ పథకం
ధుమపానంతో మెదడుకు చేటు
జనవరి 6న తొలి విడత పోలియో చుక్కలు
అత్యుత్తమ వైద్య సదుపాయం: అగ్రస్థానంలో చెన్నై
కరచాలనం కంటే చుంబనమే మేలట...!
సిటీ స్కానింగ్ వల్ల కాన్సర్ ప్రమాదం: పరిశోధనలో వెల్లడి
భవిష్యత్
వాస్తు - మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి.
ఇంకా చదవండి|మరిన్ని...
సాహిత్యం
AP
 
కుక్క పిల్ల... సత్తిరెడ్డి
కోడిపుంజు అరుపుతో ఆ కుగ్రామంతోపాటు సత్తిరెడ్డి మేలుకున్నాడు. అయితే తన పక్కలో వెచ్చగా ఏదో...
భర్తలో మార్పు కోసం
ఇదిగో ఇది నా కలం
భవిష్యత్
తారాఫలం - బాల నటుడిగా వెండి తెరకు పరిచయమైన తరుణ్ అలనాటి నటి రోజా రమణీ, దర్శకనిర్మాత, నటుడు చక్రపాణి...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace