|
| అమెరికన్ వైద్యుల్లో నిర్లక్ష్యం పాలు ఎక్కువే |
| వాషింగ్టన్ (ఏజెన్సీ), బుధవారం, 5 డిసెంబర్ 2007 ( 20:06 IST ) | |
వైద్యో నారాయణోః హరి అనేది నానుడి. వైద్యులను జనం దేవుడిలా భావిస్తారు. కానీ అమెరికాలో సగం మంది వైద్యులు బాధ్యత మరచి ప్రవర్తిస్తున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. తమ సహచర వైద్యులు చికిత్స చేసేటప్పుడు అసమర్థంగా, అనైతికంగా వ్యవహరిస్తున్నా తాము నోరు విప్పడంలేదని వారు అంగీకరించారు. మసాచూసెట్స్ ప్రభుత్వ ఆసుపత్రి, బోస్టన్‌లోని హార్వర్డ్ వైద్య పాఠశాలకు చెందిన ఎరిక్ క్యాంప్‌బెల్ అధ్యయనానికి నేతృత్వం వహించారు. క్యాంప్‌బెల్ బృందం 1600 మందికిపైగా వైద్యులను ప్రశ్నించింది.
దీని ఆధారంగా వారు రూపొందించిన నివేదికను 'ఆనల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్' మేగజైన్ ప్రచురించింది. అధ్యయనం ప్రకారం... సరైన పద్ధతిలో చికిత్స చేయకపోవడం, ఇతర లోపాలు వంటి విషయాలను తాము పైస్థాయి అధికారులకు తెలియజేయాల్సి ఉందని 96 శాతం మంది వైద్యులు అంగీకరించారు.
అన్నీతెలిసినా ఒక్క సందర్భంలోనూ తాము ఏమీ చేయలేదని 31 శాతం మంది వైద్యులు అంగీకరించారు.. తీవ్రమైన వైద్యు లోపాలు జరుగుతున్నట్లు తమకు తెలుసనీ, అయినా అధికారులకు చెప్పడం లేదని సర్వే చేసిన వైద్యుల్లో 46 శాతంమంది అంగీకరించారు.
ఇది తమ బాధ్యతగా మెత్తం గుండె నిపుణులు, శస్త్రచికిత్సలు చేసే వైద్యులలో మాత్రం 45 శాతం మందే అంగీకరించారు. లోపాల గురించి తాము రోగికిగానీ, వారి తరపున వారికి గానీ చెప్సాలిన బాధ్యత ఉందని 85 శాతం మంది వైద్యులు అభిప్రాయపడగా తమ ఆసుపత్రుల్లో తీవ్రమైన వైద్యలోపాలు జరిగినట్లు తమకు తెలుసని 40 శాతంమంది ఒప్పుకున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| తారాఫలం - భారత టెస్ట్ క్రికెట్ క్రీడాకారుల్లో అత్యధిక వికెట్లను పడగొట్టిన అనిల్ కుంబ్లే ప్రపంచ వ్యాప్తంగా... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| కవితలు - యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా
పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో... |
| |
|
|
|
|
|
|
|