|
| చర్మంపై దద్దుర్లు వస్తే తస్మాత్ జాగ్రత్త | |
చర్మంపై దద్దుర్లు వలే కనిపించే అమ్మవారి వ్యాధిని తట్టు లేదా పొంగు అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తుంటారు. మార్‌బిల్లీ అనే వైరస్ వల్ల కలిగే ఈ వ్యాధి ప్రధానంగా పిల్లల్లో కనిపిస్తుంది. క్రీ.పూ.600 సంవత్సరము కాలం నుంచే ఉన్నట్టు ఆరోగ్య గణాంకాలు చెబుతున్నాయి.
కళ్లు ఎర్రబడటం, నోటి లోపలి బుగ్గల్లో ఇసుక రేణువుల వంటి మచ్చలు కనిపించడం ఈ వ్యాధి లక్షణాలు. ఇవి 24-36 గంటలు మాత్రమే ఉంటాయి. దద్దుర్లు ప్రారంభమై జ్వరం తగ్గుముఖం పట్టగానే అవి మాయమవుతాయి.
అంతేకాకుండా మూడు రోజుల కంటే ఎక్కువ కాలం జ్వరం ఉండడం దద్దుర్లు ముఖం నుండి ప్రారంభమయి కాళ్ళ వైపుకు దిగ పాకడం. దగ్గు, మగతగా ఉండడం, ఆకలి లేక పోవడం వంటి లక్షణాల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు.
తట్టు కలిగించే వైరస్ క్రిమి చాలా తేలికగా వ్యాపిస్తుంది. ప్రధానంగా వ్యాప్తి గాలి ద్వారా జరుగుతుంది. వ్యాధి ఉన్న వ్యక్తికి దగ్గరగా ఉండడం వల్ల రోగి విడిచిన గాలిలో ఉండే క్రిములు ఇతరుల శ్వాసనాళ వ్యవస్థలోకి ప్రవేశిస్తాయి.
రోగి దగ్గినా, లేదా తుమ్మినా ఆ క్రిములు మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఒకసారి మరో రోగి శరీరంలోకి ఇవి ప్రవేశించగానే శరీర ఉపరితలంపై ఉండే కణజాలానికి అంటుకొని అక్కడ నుండి కణాల్లోకి ప్రవేశించి రక్తం ద్వారా వివిధ శరీర వ్యవస్థలపై కూడా దాడి చేస్తాయి.
తట్టు జనాభా ఎక్కువ ఉన్నప్రదేశాలలో అతి వేగంగా ప్రబలుతుంది. సాధారణంగా ఈ జబ్బు శరీరంలో ప్రవేశించినప్పటి నుండి రోగ లక్షణాలు కనిపించడానికి 4-12 రోజులు పట్టవచ్చు.
రోగలక్షణాలు కనిపించిన మూడు రోజుల నుంచి మొదలుకొని దద్దుర్లు పూర్తిగా తగ్గిన ఐదు రోజుల వరకు ఆ రోగులకు దగ్గరగా ఉండటం మిగిలిన వారికి మంచిది కాదు. అలా దగ్గరుండే వారికి సైతం ఈ రోగం వ్యాపించే ప్రమాదముంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| వార్తలు - హెచ్‌ఐవీ రోగుల కోసం బ్రిటన్‌లో కొత్త ఔషధం కనిపెట్టారు. రాల్తేగ్రావిర్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ ఔషధం... |
| |
|
|
|
|
 | | WD |
| | | జెనీలియా | | ''బాయ్స్'' చిత్రంతో వెండితెరకు పరిచయమైన జెనీలియా అనతికాలంలోనే తెలుగు, తమిళం... |
|
| |
|
|
|
|
|
| టాలీవుడ్ - తరుణ్, ఇలియానాలు జంటగా నటిస్తున్న తాజా చిత్రంలో జగపతిబాబు ఓ కీలకమైన పాత్రలో కన్పించనున్నారు. |
| |
|
|
|
|
|
|
|