|
| మధ్య వయస్సులో గర్భధారణతో స్త్రీలకు చిక్కులు | |
మధ్య వయస్సులో గర్భం ధరించిన స్త్రీలలో ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఆలస్యంగా గర్భం ధరించడం వల్ల స్త్రీలకు అనేక రకమైన సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆ పరిశోధనలు నిరూపిస్తున్నాయి.
నేటి సమాజంలో స్త్రీలు గర్భం ధరించే అవకాశాన్ని ఆలస్యం చేయడం వల్ల వారు భవిష్యత్‌లో అనేక రకాల సమస్యలకు గురవుతారని ఆస్ట్రేలియా వైద్య బృందాలు పేర్కొంటున్నాయి. ఆలస్యంగా గర్భం ధరించిన స్త్రీలకు పుట్టే పిల్లల్లో శారీరకపరమైన వికలత్వం చోటుచేసుకోవడమే గాక అలాంటి పిల్లలు డౌన్ సిండ్రోమ్‌కి గురయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఆ వైద్య పరిశోధనలు నిరూపిస్తున్నాయి.
ఆలస్యంగా గర్భం ధరించే తల్లులకు పుట్టే ప్రతి వంద మంది పిల్లల్లో ఒకరికి ఈ రకమైన శారీరక, మానసిక పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య బృందాలు చెబుతున్నాయి. అలాగే నలభై ఏళ్లు పైబడిన వయస్సులో గర్భం ధరించే స్రీలలో నాలుగోవంతు మందికి గర్భస్రావం అయ్యే అవకాశలు అధికంగా ఉన్నాయని వైద్య పరిశోధనలు తెలుపుతున్నాయి.
ముప్పై కంటే తక్కువ వయస్సులో గర్భం ధరించిన స్త్రీల కన్నా నలభైకి పైబడిన వయస్సులో గర్భం ధరించే స్త్రీలకు ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తే అవకాశాలు 14 శాతం ఎక్కువని పరిశోధనలు తెలుపుతున్నాయి.
మరోవైపు 40కి పైబడిన స్త్రీలకు పుట్టిన పిల్లలకు తల్లిప్రేమ అధికంగా లభిస్తుందని, వారు మిగిలిన పిల్లలకన్నా చురుకుగా ప్రవర్తిస్తారని ఈ పరిశోధనలు తెలుపుతున్నాయి. మధ్య వయస్సులో స్త్రీలకు ఉన్న మానసిక పరిపక్వత, ఆర్ధిక స్వాతంత్ర్యం తదితర అంశాలు పిల్లల పెంపకంలో ప్రాముఖ్యాన్ని వహించడం ద్వారా పిల్లల్లో ఈ వికాసానికి కారణమవుతున్నాయని ఆ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| వాస్తు - మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి. |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - బాల నటుడిగా వెండి తెరకు పరిచయమైన తరుణ్ అలనాటి నటి రోజా రమణీ, దర్శకనిర్మాత, నటుడు చక్రపాణి... |
| |
|
|
|
|
|
|
|