|
| శరీరంలో గుండె, రక్తనాళాలు పనిచేసే తీరు | |
శరీరంలోని ముఖ్య అవయవాలు పనిచేసేందుకు ఆక్సిజన్, ఆహారం అవసరం. ముఖ్యంగా మెదడుకు తగినంత రక్తం అందకపోతే అది పనిచేయటం తగ్గిపోతుంది. మెదడు పనిచేయకపోతే శరీరంలోని మిగిలిన అవయవాలు చచ్చుపడిపోతాయి. సాధారణంగా శరీరంలోని విషపదార్థాలు రక్తంలో చేరి మూత్ర పిండాల ద్వారా బయటకు నెట్టబడతాయి. శరీరంలో రక్తం సరిగా ప్రవహించకపోతే ఈ పనిజరగదు. కారణంగా రక్తంలో విషపదార్థాల శాతం ఎక్కువ అయి కణాలు దెబ్బతింటాయి. శరీరంలోని ప్రతి కణానికి ప్రాణవాయువు అందాలి. రక్తం తగినంత వేగంతో రక్తనాళాల్లో ప్రవహించకపోతే శరీరంలో మారుమూల ప్రాంతాలకి ప్రాణవాయువు అందదు. ప్రాణవాయువు రక్తం ద్వారానే కణాలకు చేర్చబడుతుంది.
ఎర్ర రక్తకణాలపైన హిమోగ్లోబిస్ అనే పదార్థం వుంటుంది. హిమోగ్లోబిన్ ప్రాణవాయువును నింపుకుని కణకణానికి అందజేస్తుంది. రక్తం ఊపిరితిత్తులలోనికి ప్రయాణించినపుడు ఎర్ర రక్తకణాలు ప్రాణవాయువును తీసుకుని శరీరంలోని వివిధ భాగాలకు చేరతాయి. అక్కడి కణాలకు ఆక్సిజన్ అందించి వాటి నుంచి విడుదలైన కార్బన్‌డైయాక్సైడ్ (బొగ్గువులుసు వాయువు)ని సేకరించి తిరిగి ఊపిరితిత్తుల్లో చేర్చుతాయి. శ్వాస నాళాల్లో బొగ్గుపులుసు వాయువును వదిలి ప్రాణవాయువును నింపుకుంటాయి. ఈ రకంగా ప్రాణప్రదమైన ప్రాణవాయువు సక్రమంగా సరఫరా అవ్వాలంటేనూ, రక్తనాళాల్లో రక్తం సాఫీగా ప్రయాణించాలంటే కొంత ప్రెషర్ వుండాలి. ఈ కనీస ప్రెషర్‌నే నార్మల్ బ్రడ్‌ప్రెషర్ అంటారు.
అయితే మానవుని సాధారణ రక్తపోటు కూడా సమయం, సందర్బాలను బట్టి మారుతుంటుంది. ఒక వ్యక్తి విశ్రాంతిగా వున్నపుడు శరీర భాగాలకు పని తక్కువగా ఉంటుంది. అలాంటి స్థితిలో శరీరానికి ఆక్సిజన్, ఆహారం అంతగా అవసరం వుండదు. అందుకనే గుండె శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేసే పని కొద్దిగా నెమ్మదిగా చేస్తుంది. అంటే వేగంగా రక్తాన్ని సరఫరా చేయదు. ఇందువల్ల విశ్రాంతిగా కూర్చున్నపుడూ, పడుకున్నపుడూ బ్లడ్‌ప్రెషర్ తక్కువగా వుంటుంది. అదే వ్యక్తి పరిగెడుతున్నా, వడివడిగా నడుస్తున్నా మెట్లు ఎక్కుతున్నా, శారీరకంగా శ్రమ చేస్తున్నా బ్లడ్ ప్రెషర్ అధికంగా అవుతుంది. దానికి కారణం కండరాలు పనిచేసేందుకు తగినంత ఆక్సిజన్, ఆహారం అందాలి. అందుకోసం తక్కిన చోట్ల వుండే చిన్న చిన్న రక్తనాళాలు సంకోచించి ఎక్కువ రక్తాన్ని అవసరమైన చోటుకి అందిస్తాయి.
గుండె కూడా మామూలు కంటే ఎక్కువ సార్లు కొట్టుకోవటం, ప్రెషర్‌తో పని చేస్తుంది. దీనివల్ల ఆ సమయంలో మామూలు స్థితిలో కంటే గుండె అధికంగా పనిచేస్తుంది. తిరిగి ఆ వ్యక్తి సాదారణ స్థితికి రాగానే రక్తపోటు కూడా మామూలు స్థితికి వచ్చేస్తుంది. అధిక రక్తపోటు వుండే వ్యక్తిలో విశ్రాంతి స్థితిలో కూడా బ్లడ్‌ప్రెషర్ రీడింగ్ అధికంగా వుంటుంది. పని చేస్తున్నపుడు పోటు మరింత పెరిగిపోతుంది.
కొన్నిసార్లు నిలబడగానే కళ్లు తిరిగేతి ఎందుకంటే... సాధారణంగా ఏ జబ్బుకూ గురికాని వారు, ఆరోగ్యవంతుల్లో సైతం కొంతమంది అంతవరకు కూర్చునో, పడుకునో వుండి, ఒక్కసారిగా లేచి నిలబడగానే కళ్లు బైర్లు కమ్మినట్లు, తల తిరిగినట్లు ఫీలవుతారు. దానికి కారణం వారిలో సడన్‌గా రక్తపోటు పడిపోవటమే. కూర్చుండిపోయిన స్థితిలోంచి వ్యక్తి లేచి నిలబడగానే భూమ్యాకర్షణ శక్తి వలన రక్తం సరఫరా తగ్గి పోతుంది. అందువలనే కళ్లు బైర్లు కమ్మటం, తల తిరగటం జరుగుతుంది. ఇలా అందరిలో జరగదు.
నిలబడగానే భూమ్యాకర్షణ వలన రక్తం కాళ్లలోకి చేరి పోకుండా శరీరంలో దిగువభాగంలో ఉండే రక్త నాళాలు సంకోచిస్తాయి. దాని వల్ల నార్మల్ ప్రెషర్‌లో పెద్దగా తేడా రాదు. మెదడుకు మామూలుగానే రక్తం సరఫరా అవుతుంది. ప్రతి ఒక్కరిలోనూ ఎప్పుడో ఒకప్పుడు ఇలా అకస్మాత్తుగా బ్లడ్‌ప్రెషర్ తగ్గడం, కళ్లు బైర్లు కమ్మడం జరుగుతుంది. ఎప్పుడో ఒకసారి ఇలా సహజంగానే జరుగుతుంటుంది. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తరచు జరుగుతూ వుంటేనే దాని గురించి పరిశీలించాలి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| వాస్తు - మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి. |
| |
|
|
|
|
 | | WD |
| | | స్నేహ | | గ్లామర్‌కు దూరంగా ఉంటూ నటనకు అవకాశమున్న పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకుని తనకంటూ... |
|
| |
|
|
|
|
|
| కవితలు - నా జీవిత ప్రబంధానికి రెండే ఆశ్వాశాలు
ఉచ్చ్వాసమూ, నిశ్వాసమూ
నా జీవితేతిహాసానికి రెండే సర్గలు... |
| |
|
|
|
|
|
|
|