|
| నడుము నొప్పికి కారణాలు, మందులు | |
నడుము నొప్పికి ముఖ్య కారణం వెన్నెముక చివరి భాగం అరిగిపోవడమే. ఇంతేకాకుండా టీబీ, క్యాన్సర్ వంటి వ్యాధుల కూడా వెన్నుపూస అరిగిపోవడానికి దారి తీస్తాయి. దీంతో నడుము నొప్పి ఏర్పడుతుంది.
సాధారణంగా నడుమునొప్పికి ఇచ్చే చికిత్సను గమనిస్తే నొప్పిని తగ్గించే మందులతోపాటు పూర్తి విశ్రాంతి. సుమారు రెండు, మూడు వారాలపాటు పడకలో వెల్లికల పడుకొని ఉంటే నడుము నొప్పి తగ్గుతుంది.
ఈ విధమైన చికిత్స ద్వారా నొప్పి తగ్గనివారికి ట్రాక్షన్ పద్ధతిలో కాళ్లకు బరువును కట్టి దానిని నడుముకు చేర్చి కడుతారు. ఇలా రెండు వారాల పాటు రెస్ట్ తీసుకుంటే నడుము నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
మూడు నెలలపాటు నడుముకు బెల్ట్‌ను కట్టుకోవాలి. అలా కూడా నడుము నొప్పి తగ్గకపోయినట్లైతే ఇక సర్జరీనే చేయాల్సి ఉంటుంది. వైద్య పద్ధతులు ఎలా ఉన్నప్పటికీ, ఒకే దగ్గర కూర్చోవడం, ఎలాపడితే అలా నడుమును వాల్చడం, ఎక్కువగా ద్విచక్ర వాహనాన్ని నడపడం వంటి వాటికి కాస్త దూరంగా ఉండగలిగితే నడుమునొప్పి సమస్యే రాదు సుమా.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| వాస్తు - మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి. అకస్మాతుగా ఎదురయ్యే శకునమే మంచి శకునం. మీరు ఇంటి నుంచి బయటకు ఎక్కడికైనా బయలుదేరే సమయంలో పసుపు,... |
| |
|
|
|
|
 | | WD |
| | | స్నేహ | | గ్లామర్‌కు దూరంగా ఉంటూ నటనకు అవకాశమున్న పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకుని తనకంటూ... |
|
| |
|
|
|
|
|
| కవితలు - నా జీవిత ప్రబంధానికి రెండే ఆశ్వాశాలు
ఉచ్చ్వాసమూ, నిశ్వాసమూ
నా జీవితేతిహాసానికి రెండే సర్గలు
అరసున్నా విసర్గమూ
నా జీవిత పద్యానికి రెండే పాదాలు
స్మృతి, మృతీ... |
| |
|
|
|
|
|
|
|