|
| గుండె, మూత్రపిండాలకు మధుమేహంతో చేటు: నిపుణుల హెచ్చరిక | | - సంకలనం మునిబాబు సామా |
| గురువారం, 20 డిసెంబర్ 2007 ( 11:34 IST ) |
|
నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు మధుమేహం గురించి ఆందోళన చెందుతున్నారంటే అతిశయోక్తి కాదేమో. చక్కెర వ్యాధి, షుగర్ అని సాధారణంగా పిలిచే ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేసిన పక్షాన భవిష్యత్‌లో మూత్రపిండాలు చెడిపోవడం, గుండెకు సంబంధించిన సమస్యలతో పాటు కంటిలో ఏర్పడే లోపాల వల్ల చూపు తగ్గిపోవడం లాంటి ఇతర సమస్యలు తలెత్తే అవకాశముంది.
రక్తంలోని చక్కర నిల్వలు పేరుకుపోవడం ప్రధాన సమస్యగా ఉండే ఈ వ్యాధి వల్ల దీనిబారిన పడినవారికి అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. దేహానికి తగిలే అతిచిన్న గాయాలు సైతం మానకుండా పోవడం ప్రధానంగా ఈ వ్యాధి సంభవించిన వారికి అనుభవమే.
అందుకే ఈ మధుమేహాన్ని అదుపులో ఉంచే చర్యలను పాటించడం వల్ల తద్వారా తలెత్తే సమస్యలకు ప్రారంభంలోనే అడ్డుకట్ట వేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వైద్యుని సలహా మేరకు క్రమమైన ఆహారం తీసుకోవడం, ప్రతిరోజు శరీరానికి అవసరమైన వ్యాయామాన్ని చేయడం, సరైన విశ్రాంతి తీసుకోవడం లాంటివి పాటించాలి.
తద్వారా మధుమేహం వల్ల కలిగే నష్టాలను పూర్తిగా అదుపులో ఉంచవచ్చని వారు చెపుతున్నారు. అలాగే మధుమేహానికి ఉపయోగించే ఔషదాల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని వారు అంటున్నారు.
మధుమేహం నివారణకు తీసుకునే ఇన్సులిన్ డోసును వైద్యుని సూచన మేరకే ఉపయోగించాలని, ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న చక్కెర లేని తీపి పదార్థాల విషయంలో స్వీయ నిర్ణయాల కన్నా వైద్యుని సలహా పాటంచడమే ఉత్తమని చెపుతున్నారు.
ప్రాథమికంగా మధుమేహాన్ని అదుపులో ఉంచాలంటే రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్దీకరించడం అవసరమని నిపుణుల సలహా. ఇందుకోసం రక్తంలో చక్కెర నిల్వలను పెంచే ఆహార పదార్ధాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరమని వారు అంటున్నారు.
ముప్పైయేళ్ల వయస్సు పైబడిన వారు నిర్ణీత సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ మధుమేహాన్ని అదుపులో ఉంచవచ్చని వారు సలహా ఇస్తున్నారు.
తల్లితండ్రులకు మధుమేహం సమస్య ఉన్నట్లయితే అది వారి పిల్లలకు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటుందని, అందుకే ఇలాంటి వారు ఈ విషయంలో కాస్త జాగురకతతో వ్యవహరించడం మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| వాస్తు - ఇంటిలో ఎక్కడపడితే అక్కడ కారు, బైక్, సైకిల్ వంటి వాహనాలను పార్కింగ్ చేయలేము. |
| |
|
|
|
|
 | | WD |
| | | విక్టరీ వెంకటేశ్ | | పుట్టిన తేదీః డిసెంబర్ 13, 1960
అదృష్ట సంఖ్యలుః 4, 6
దక్షిణాది సినీ రంగంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని... |
|
| |
|
|
|
|
|
| కవితలు - యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా
పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో... |
| |
|
|
|
|
|
|
|