|
| ఆహార ధాన్యాలతో హృద్రోగాలు దూరం | |
ఉదయం తీసుకోనే ఆహారంలో ధాన్యంతో కూడిన పదార్థాలను తీసుకోవడం ద్వారా హృద్రోగాలను, గుండె పోటును అదుపులో ఉంచగలమని వైద్య పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. అమెరికాకు చెందిన హార్వార్డ్ విశ్వవిద్యాలయ వైద్యులు గత 18ఎళ్లుగా నిర్వహించిన ఫరిశోధనల్లో ఈ విషయం రుజువు చేయబడింది.
హార్వార్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఈ ఫరిశోధనలో వారంలో రెండు నుండి ఆరు రోజులు అల్పాహారంగా ధాన్యం రకాలతో చేయబడిన పదార్థాలను తీసుకునే వారిలో దాదాపు 21 శాతం వరకు హృద్రోగాలు, గుండె నొప్పి లాంటి వాటినుంచి రక్షణ లభిస్తోందని తెలిసింది.
కాగా వారంలో ఏడు రోజులు ధాన్యం రకాలతో చేసిన పదార్థాలను ఆహారంగా తీసుకునే వారికి హృద్రోగాలు, గుండె నొప్పి నుంచి దాదాపు 29 శాతం వరకు రక్షణ లభిస్తోందని గుర్తించబడింది.
మనం తీసుకునే ఆహారంలోని కార్బోహైడ్రేడ్స్ గుండె జబ్బుల నివారణలో ఉపయోగ పడుతాయని, ఉదయం తీసుకునే అల్పాహారంలో ఇవి దాదాపు 4 గ్రాముల వరకు వీటి అవసరం ఉంటుందని ఈ పరిశోధన నిర్వహించిన వైద్య బృందం వివరించింది.
అందుకే మనం తీసుకునే ఆహారంలో ధాన్యం రకాలతో కూడిన పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేడ్స్‌ను భర్తీ చేయగలమని వారు తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| తారాఫలం - భారత టెస్ట్ క్రికెట్ క్రీడాకారుల్లో అత్యధిక వికెట్లను పడగొట్టిన అనిల్ కుంబ్లే ప్రపంచ వ్యాప్తంగా... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| కవితలు - యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా
పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో... |
| |
|
|
|
|
|
|
|