|
| కలవరపరచే కలరా: అపరిశుభ్రతే కారణం | |
జనసమ్మర్థంగా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అపరిశుభ్రత చోటుచేసుకుంటే కలరా సోకుతుంది. విబ్రియో కలరా అనే వైరస్ క్రిములున్న ఈ అంటు వ్యాధి సోకిన ఐదారు రోజుల్లో ఎప్పుడైనా బయటపడవచ్చు. ముఖ్యంగా తినే పదార్ధాలపై ఈగలు, పురుగులు వాలినప్పుడు అవే పదార్ధాలను తిన్న వారు కలరాకు గురయ్యే ప్రమాదముంది.
పసుపు రంగులో నీళ్ల విరేచనాలు కావడం, తర్వాత ఏ రంగూ లేని విరేచనాలు, తీవ్రమయ్యాక జిగటగా బియ్యం కడిగిన నీళ్లలా విరేచనాలవుతాయి. కలరా సోకిన రోగుల్లో కొందరికి వాంతులు కూడా ఉండవచ్చు. కలరా అనేది అంటు వ్యాధి అయినందున ముందుగా కలరా రోగులను ఆరోగ్యవంతులకు దూరంగా ఉంచాలి.
కలరా వ్యాధిగ్రస్తులు వాడే వస్తువులు, ధరించే దుస్తులను ఇతరులకు దూరంగా ఉంచాలి. అంతేగాక రోగుల విరేచనాలు, వాంతులను కాల్చడం లేదా భూమిలో పూడ్చడం వంటివి చెయ్యాలి. వీరి వస్త్రాలను బాగా వేడి నీటిలో శుభ్రపరచాలి.
కలరా వ్యాధిగ్రస్తులున్న ప్రాంతాన్ని అతి శుభ్రంగా ఉంచాలి. తాగేందుకు వేడి నీరు మాత్రమే ఇవ్వాలి. కలరా వ్యాధిగ్రస్తులకు పూర్తిగా వైద్యుని సలహా మేరకు మాత్రమే మందులు వాడాలి. స్వంత నిర్ణయాలు తీసుకోవద్దు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| తారాఫలం - తొలి ట్వంటీ 20 ప్రపంచ కప్‌ను భారత్ గెలుచుకునేందుకు కారకులైన యువ క్రికెటర్లలో... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| కవితలు - అది గదిగో ఆ చక్రం నిలిచిపోదు
చైతన్యపు ఆ స్రవంతి ఇంకిపోదు
వీస్తున్నగాలి రేపుతున్న కిరణకేశాల్ని... |
| |
|
|
|
|
|
|
|