యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ ఆరోగ్యం ఆరోగ్య సమస్యలు
సెల్‌ఫోన్ వాడకం వల్ల ఏర్పడే సమస్యలు, పరిష్కారాలు...
- సంకలనం: వెంగళరావు
మానవావసరాలకు అధునాత సాంకేతిక పరిజ్ఞాన వాడకం నానాటికి పెరిగిపోతుంది. ఈ పరిజ్ఞానం అందించిన సెల్‌ఫోన్‌ను ఉపయోగించడం హానికరమని వైద్య పరిశోధకులు అప్పడప్పుడూ హెచ్చరిస్తూనే ఉన్నారు.

సెల్‌ఫోన్ త్వరలో నిత్యవసర వస్తువుగా మారిపోనుంది. ఇటువంటి పరిస్థితుల్లో దీని వాడకం వలన ఏర్పడే సమస్యలను గూర్చి వైద్య పరిశోధకులు చేసిన హెచ్చరికలు కొన్నింటినీ తెలుసుకుందాం.

ఇటీవల పదేళ్ళ పాటు నిరంతరాయంగా సెల్‌ఫోన్‌ను వాడుతున్న (ప్రతి రోజూ కనీసం గంటపాటు వాడేవారు) వారికి బ్రెయిన్ కాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు యూరప్ శాస్త్రవేత్తల తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

స్వీడన్‌కు చెందిన అమేయా కళాశాల వైద్యశాల పరిశోధకులు ఓ అధ్యయనం చేశారు. అక్టోబర్ ఎనిమిదిన ఈ అధ్యయన వివరాలు డైలీ మెయిల్ అనే పత్రిక వెల్లడించింది.

అందులో ప్రతిరోజు సెల్‌ఫోన్‌లో గంటల తరబడి మాట్లాడినట్లైతే మెదడు కణజాలం దెబ్బతినే అవకాశం ఉంది. దీంతోపాటు మెదడు నుంచి చెవిని కలిపే నరంపై గడ్డలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఈ గడ్డల వలన చెవి వినికిడి శక్తిని కోల్పోయే అవకాశాలున్నాయని ఈ పరిశోధన నివేదికలు వెల్లడించాయి.

దీంతోపాటు పిల్లలను సెల్‌ఫోన్‌ వాడకానికి దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు. చిన్న పిల్లలు మెదడు చాలా సున్నితంగా ఉంటుంది. మెదడులో నాడీమండలం పెరుగుదల పూర్తై ఉండదు. ఈ సమయంలో సెల్‌ఫోన్ వాడే చిన్న పిల్లలకు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డైలీ మెయిల్ వెల్లడించింది.

సెల్‌ఫోన్ ఎక్కువగా వాడేవారు జాగ్రత్తగా ఉండడం మంచిది. పైన తెలిపిన ప్రమాదాలను గూర్చి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సరైన వైద్యులను కలిసి సెల్‌ఫోన్ వాడకంలో గల ఆరోగ్యకరమైన పద్దతులను తెలుసుకుంటే సరి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కాలిన గాయాలు - చికిత్స విధానాలు
క్షయకు దారితీస్తున్న పరిస్థితులుః నివారణ మార్గాలు
తేలు కాటుకు... ప్రాథమిక జాగ్రత్తలు
రేచీకటికి సులభ వైద్యం
నిద్రలేమితో ఎదురయ్యే సమస్యలు
బ్యాక్టీరియా వైరస్‌లతో సోకే వ్యాధులు
దర్శనం
ఆధ్యాత్మిక చిత్రమాల - శుక్లాం బరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
విశాల్ "భయ్యా" మాస్ స్టైల్ అదిరిందయ్యా
జీకే ఫిలింస్ కార్పరేషన్ పతాకంపై విశాల్, ప్రియమణి హీరోహీరోయిన్లుగా నటించిన భయ్యా...
చరణ్ చిరుత చిత్రంలో డాన్స్, ఫైట్స్ అదుర్స్
మాస్ ప్రధానాంశంగా విజయదశమి చిత్రం
సాహిత్యం
కవితలు - అది గదిగో ఆ చక్రం నిలిచిపోదు చైతన్యపు ఆ స్రవంతి ఇంకిపోదు వీస్తున్నగాలి రేపుతున్న కిరణకేశాల్ని...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace