|
| బ్యాక్టీరియా వైరస్‌లతో సోకే వ్యాధులు | |
మనం రోజూ పీల్చే గాలిలో, తాగే నీటిలో, తీసుకునే ఆహారంలో ఎన్నో క్రిములు ఉంటాయి. వీటి ద్వారా భయంకర వ్యాధులకు లోనవుతుంటాం. ముఖ్యంగా బ్యాక్టీరియా, వైరస్‌లతో సంక్రమించే వ్యాధులు అనేకం. ఎండా కాలంలో తరచూ వడదెబ్బ బారిన పడుతుంటారు.
దీనికి కారణం ఎండలోని అతి లోహిత కిరణాలే. ఎక్కువగా ఎండలో తిరగడంతో సూర్యరశ్మిలోని హానికరమైన కిరణాలు మన శరీరాన్ని బలహీనపరచి, నీరసానికి గురిచేస్తాయి. ఇక చలికాలంలో చల్లటి నీటిని త్రాగడం ద్వారా బ్యాక్టీరియా గొంతులోకి చేరి పుండుగా మారే ప్రమాదముంది.
ఈ కారణంగా తరచూ జ్వరం వస్తుంది. అలాగే ఆహార, నీటి కలుషితం ద్వారా కలరా వ్యాపిస్తుంది. దీని లక్షణాలు వాంతులు, విరేచనాలు, వంటి నొప్పులు మొదలైనవి. ఇలాంటిదే కోరింత దగ్గు. ఈ వ్యాధికి గురైన వారు దగ్గినపుడు, తుమ్మినపుడు వారి నుంచి వెలువడే క్రిములు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి.
దీనితో చలి, పొడి దగ్గు వంటివి మొదలవుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి బలంగా ఉన్నంతకాలం అది క్రిములతో పోరాడుతుంది. అయితే వృద్ధాప్యం సమీపించే క్రమంలో వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుండటంతో ఈ బాక్టీరియా, వైరస్‌ల ప్రభావంతో సులభంగా వ్యాధులు సోకుతాయి.
బాక్టీరియా కారణంగా వ్యాపించే మరో వ్యాధి మలేరియా. ఇది తీవ్ర దోమకాటుతో వస్తుంది. ఈ ప్లాస్మోడియం ప్రొటోజోవా శరీరంలోకి ప్రవేశించి రక్తం ద్వారా అన్ని భాగాలకు సోకుతుంది. తలనొప్పి, తీవ్రమైన జ్వరం ఉంటాయి. చలితో వణుకు వస్తుంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|