|
| వెన్నెముకపై నిర్లక్ష్యంతో నానా సమస్యలు | |
మానవ జీవితం సాఫీగా సాగాలనుకుంటే వెన్నెముక పాత్ర ఎంత ముఖ్యమో చెప్పనవసరం లేదు. ఇది లేనిదే మనిషి ఏ పని చేయలేడు. మనిషి నడచినట్టుగా ఏ జంతువుకూ మనలాగా నిటారుగా నడవడం సాధ్యపడదు. వెన్నెముక పాత్రే ఇందులో కీలకంగా ఉందన్నది కాదనలేని సత్యం.
మన శరీరానికి పునాది లాంటి ఈ వెన్నెముక ప్రమాద వశాత్తు దెబ్బతింటే ఏపనీ చేయలేం. అటువంటి వీటిపై ఎవరూ శ్రద్ద చూపనందున ప్రజలు ఎన్నో రకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నారు.
సౌందర్యానికి ఇచ్చే ప్రాముఖ్యత ఆరోగ్యానికి ఇవ్వడం లేదు. మనమింత ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండడానికి పనిచేయడానికి కారణం మన ఎముకలే కాని వాటి సంరక్షణలో మన పాత్ర ఎంతుందో గమనించాలి. మనం కూర్చోవాలన్నా, నిలబడాలన్నా, వంగాలన్నా ముఖ్యంగా ఉండాల్సింది వెన్నెముక.
ఈ రోజుల్లో శారీరక శ్రమ తగ్గి మానసిక శ్రమ ఎక్కువవుతోంది. గంటల తరబడి ఒకే చోట కూర్చుని పని చేయడంతో మన శరీరానికి అవసరమైన వ్యాయామం దొరకడం లేదు. ఇహ ఇళ్లలో సరేసరి వంగకుండా సులభంగా పనులు చేసుకునే విధంగా ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి.
ఆహార అలవాట్లు, కాలుష్యం మొదలైన కారణాలతో ఆరోగ్యం పాడైపోతోంది. మన పూర్వీకుల తీసుకున్న ఆహారంతో పోలిస్తే మన ఆహారంలో పోషక పదార్థాలు తక్కువగా ఉండడంతోనే మనకు ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయని ఓ సర్వేలో తేలింది.
సరైన రీతిలో పోషకాహారం లేకపోవడం ఎముకలను కూడా బలహీనపరుస్తుంది. శరీరాన్ని ఇష్టం వచ్చినట్టుగా తిప్పడంతో ఏర్పడే ప్రమాదం ఏ పనీ లేక ఊరికే కూర్చోవడంలోనూ ఉంది. ఈ రెండు స్థితులలోనూ ఎముకలు అరిగిపోవడం మొదలవుతుంది.
బడికెళ్లే పిల్లలు కూడా ఈ వెన్నెముక సమస్యకు దారుణంగా గురవుతున్నారు. వారు మోసుకెళ్లే పుస్తకాల బ్యాగ్‌ల ద్వారా వెన్నుముక అరిగిపోవడమే కాక పక్కన ఉన్న మిగతా భాగాలు కూడా బలహీన పడే అవకాశం ఉంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|