|
| పోసాని "చేపల చెరువు" |
| సోమవారం, 18 మే 2009 ( 19:09 IST ) | |
పోసాని కృష్ణ మురళీ, బ్రహ్మాజీ, చలపతిరావు, గిరిబాబు, బ్రహ్మానందం, కొండవలస, గౌతంరాజు, సన, వేణుమాధవ్ తదితరులు నటించిన చిత్రం "రాజావారి చేపల చెరువు". ఈ సినిమాకు నిర్మాత: సుబ్రహ్మణ్యం, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పోసాని కృష్ణ మురళీ.
పాయింట్: నాయకులకు, ప్రజాసేవకులకు ఓటువేయండని చెప్పే చిత్రం.
ఇది మరో రాజకీయ చిత్రం. సమాజంలో జరుగుతున్న రకరకాల సంఘటనలను ఇతివృత్తంగా తీసుకుని పాలకుల్ని నిలదీసే దర్శకుడు పోసాని కృష్ణ మురళీ. పౌరుడికున్న సందేహాలు ఆయన సినిమాల్లో ప్రతిధ్వనిస్తాయి. ప్రభుత్వాధికారుల్లో అవినీతి, రాజకీయాల్లో నీతి లేదని చెప్పే చిత్రాల కోవలో ఈ చిత్రమూ వస్తుంది.
నాయకులు అసత్యాలు పలికి ఆడిన మాటను వెనక్కి తీసుకుంటే ఒప్పు, సామాన్యుడు అబద్ధం ఆడితే తప్పా? అంటూ తనదైన శైలిలో ప్రశ్నలు సంధించి ఇదెక్కడి న్యాయం? అంటూ నిలదీస్తాడు. ఆఖరికి ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉండాలి? అంటూ ముగిస్తాడు.
కథ: రాజా (పోసాని) సిన్సియర్ సబ్‌ఇన్స్‌స్పెక్టర్. తన సర్కిల్ పరిధిలో శ్రీను అనే వ్యక్తి తనను ప్రేమించడం లేదని లక్ష్మీ అనే కాలేజీ యువతిపై కాలుతున్న తారును పోసి కళ్ళను పోయేలా చేస్తాడు. ఇది చూసిన మరో కాలేజీ అమ్మాయిని ఆస్పత్రి పాలు చేస్తాడు. ఆ ఏరియా ఎమ్మెల్యే తమ్ముడు శ్రీనుకు ఎమ్మెల్యే సహకరిస్తాడు.
ఎమ్మెల్యే తమ్ముడనే విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా తన లాజిక్కులతో శ్రీనును అరెస్ట్ చేసి, శ్రీను కళ్ళు ఆ యువతికి అమర్చేలా చేస్తాడు. మీడియా అంతా రాజాను సపోర్ట్ చేయడంతో రాజాకు ఇమేజ్ పెరుగుతుంది. ఎమ్మెల్యే పదవీచ్యుతుడవుతాడు. అనంతరం అతని తండ్రి కోటశ్రీనివాసరావు అప్పుడే జరిగే ఎలక్షన్లలో ఎమ్మెల్యేగా నిలబడతారు. ఇతనికి పోటీగా శివప్రసాద్ (గిరిబాబు) ప్రజాసేవకుడిగా నిలబడతాడు. ఈ క్రమంలో కోటశ్రీనివాసరావు తప్పుల్ని రాజా వెలికితీసి అతని పరువు పోయేలా చేస్తాడు. ఆ అవమానంతో ఆత్మచేసుకుంటాడు కోటశ్రీనివాసరావు. అనుకున్నట్లు చనిపోతాడు. దీంతో రాజా పోలీసు ఉద్యోగం కాస్త ఊడుతుంది.
తర్వాత ఏదో చేయాలని చేపలచెరువు వ్యాపారానికి ఉపక్రమిస్తాడు. ఆ క్రమంలో ఎంతో మంది ప్రభుత్వఉద్యోగులకు లంచాలు ఇవ్వాల్సి వస్తుంది. అనుకున్నట్లు చేపల చెరువు పెడతాడు. కానీ ఓ రోజు తన చేపల చెరువును ఎవరో కిడ్నాప్ చేశారని, దానికోసం ఐదు లక్షలు డిమాండ్ చేస్తున్నారంటూ.. కొత్త సమస్యను పోలీసుల ముందుంచుతాడు. అసలు చేపల చెరువు కిడ్నాప్ కావడం ఏమిటి? ఆ తర్వాత పోసాని ఏం చెప్పదలచుకున్నాడు. అన్నది మిగిలిన సినిమా.
విశ్లేషణ: ఈ కథలో పోసాని ఒన్‌మేన్ షో చేశాడు. ఆపరేషన్ దుర్యోధనలో ఇతరుల్ని హీరోగా పెట్టి తీశాడు. కానీ ఈ చిత్రంలో తనే హీరోగా చేశాడు. ఆపరేషన్ దుర్యోధనలో శ్రీకాంత్‌ను అదేతీరుగా నటింపజేశాడు. ప్రజలు అరాచకాన్ని, అన్యాయాన్ని నగ్నంగా చూడాలి. అప్పుడే ఫీలవుతారు. ఆ తర్వాత ఏదో చేయాలనుకుంటారు. ఆ దశలో పోరాడాలనిపిస్తుంది. లేదంటే ఇలాగే జీవశ్చవాల్లా ఉండాల్సి వస్తుందంటూ.. ఆ నగ్న సన్నివేశం గురించి పెద్ద లెక్చరిస్తాడు పోసాని.
ఇదే తరహాలో చేపల చెరువు చిత్రంలోనూ చాలా సంఘటనలు చోటుచేసుకుంటాయి. అధికార పార్టీ అభ్యర్థికి పోటీగా మొగల్తూర్ నుంచి వచ్చిన ప్రజా సేవకుడిగా గిరిబాబును ప్రవేశపెడతారు. రక్తదానం, నేత్రదానం చేసి ప్రజాసేవకుడిగా ముందుకు వస్తానని చెప్పిస్తాడు.
ఇకపోతే.. పోసాని చిత్రంలో కథకంటే సన్నివేశపరంగా డైలాగ్‌లు ప్రస్ఫుటంగా ఉంటాయి. తనపై అధికారి వచ్చి నిందితుడు శ్రీనును స్టేషన్‌నుంచి తీసుకెళితే.. వివిధ కేసుల్లో ఉన్న మిగిలిన వారిని కూడా ఎస్.ఐ హోదాలో వారిని విడుదల చేసి లాజిక్కు వల్లిస్తాడు. ఎమ్మేల్యే మాటకున్న విలువ గెలిపించిన ప్రజలకెందుకివ్వరని ప్రశ్నిస్తాడు.
మరోవైపు కోటశ్రీనివాసరావు చెప్పే డైలాగ్‌లు రాజకీయనాయకుల వితండవాదంలా అనిపిస్తుంది. అసెంబ్లీలో సీఎం అవినీతి పరుడని ప్రతిపక్ష నాయకులు వేలెత్తి చూపితే.. అన్నీ తెలిసిన పోలీసు వ్యవస్థే ఏమీ చేయలేకపోతుంది. అదే సామాన్యుడు చిన్న తప్పు చేస్తే వెంటనే స్పందిస్తారు? ఇదెక్కడి న్యాయమని పోసాని నిలదీస్తాడు.
పార్టీ నాయకుల వ్యక్తిగత విమర్శలను వేలెత్తి చూపించాడు. పోలీసు స్టేషన్ దేవాలయం అనుకున్న రోజునే న్యాయం జరుగుతుందని ఓ సందర్భంలో చెబుతాడు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రభుత్వాధికారుల అవినీతి మయం ఎలా ఉంటుందో చేపల చెరువు పర్మిషన్ కోసం ఎవరెవరిని కలవాలనేది కళ్లకు కట్టినట్లు చూపించాడు.
మొదటి భాగం కాలేజీ అమ్మాయిలపై దాడి చేసే పాయింట్‌తో సాగిన కథ. సెకండాఫ్‌లో చేపల చెరువు పాయింట్‌పై అవినీతి చుట్టూ తిరుగుతూ సాగదీతగా అనిపిస్తుంది, రామాయణంలో హనుమంతుడు సంజీవని కోసం కొండనే ఎత్తి పట్టుకురావడమనేది నిజమైతే తన చేపల చెరువు కన్పించకపోవడం అనేది అంతే నిజమని పోసాని వాదిస్తాడు. ఇలా తన వాదనలతో, లాజిక్కులతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ప్రయత్నంలో లా..జి..క్కు ఎక్కువైంది. మరి చేపల చెరువును ప్రేక్షకులు ఎంతమేరకు ఆదరిస్తారో వేచి చూడాల్సిందే..!
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|