యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం సినిమా చూద్దాం
రవితేజ మార్కుతో ఆకట్టుకునే 'కిక్'
ఆదివారం, 10 మే 2009   ( 15:04 IST )
Kik
PC
నిజానికి అతను వెతుకుతున్న దొంగ కళ్యాణే (రవితేజ). అతడి కోసమే కృష్ణ మలేషియా వస్తాడు. మరి వచ్చాక కృష్ణ, కళ్యాణ్ (రవితేజ)ను అరెస్ట్ చేశాడా? నైనా పోలీస్ ఆఫీసర్‌ను పెళ్లిచేసుకుందా? హీరో రవితేజ పరిస్థితి ఏమిటి? అసలు దొంగగా కళ్యాణ్ (రవితేజ) ఎందుకు ముద్ర వేసుకున్నాడు? అన్న విషయాన్ని తెరపై చూడాల్సిందే..!

విశ్లేషణ:
కిక్ చిత్రం మొత్తం రవితేజపై ఆధారపడి ఉంటుంది. ఈ చిత్రంలో రవితేజ చాలా ఎనర్జిటిక్‌గా కన్పిస్తాడు. ఈ చిత్రంలో ఇలియానా బాగానే నటించిందని చెప్పవచ్చు. వీరితోపాటు తమిళనటుడు శ్యామ్ పోలీసు పాత్రకు చక్కగా సరిపోయాడు. దర్శకుడిగా సురేందర్ రెడ్డి యాక్షన్ చిత్రమైన అతనొక్కడే ఇమేజ్ నుంచి వైదొలగి కాస్త వినోదాన్ని పంచే ప్రయత్నంలో కిక్ చిత్రాన్ని చేశాడని చెప్పవచ్చు.

భారీ నిర్మాణ వ్యయానికి సాంకేతిక సిబ్బంది తోడుకావడం ఈ చిత్రానికి ఫ్లస్ అయ్యింది. కథ అందించిన అబ్బూరి రవి, మాటలు రాసిన వక్కంతం వంశీ ఇద్దరు కిక్ ద్వారా తమ చాతుర్యాన్ని నిరూపించుకున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందంపై పెట్టిన కామెడీ హైలైట్‌గా నిలుస్తుంది.

పోలీస్ స్టేషన్‌లో రవితేజ, షిండే, బ్రహ్మానందంల మధ్య జరిగే ఆత్మహత్య సన్నివేశం, షాపింగ్ కాంప్లెక్స్‌లో రవితేజ, బ్రహ్మానందంల కామెడీ సన్నివేశాల సందర్భంగా నవ్వని ప్రేక్షకుడంటూ ఉండడనే చెప్పవచ్చు. ఓ సన్నివేశంలో రవితేజ వ్యక్తిత్వాన్ని గ్రాఫిక్స్‌లో చూపించడం ఆకట్టుకుంటుంది.

ఇక రసూల్ ఫోటోగ్రఫీ కథకు సరిపోయింది. గోగో.. గోగోరే.. పాట మాస్‌ను ఆకట్టుకుంటుంది. తెలుగు పాటలో హిందీ పదాలు చొప్పించిన "దిల్ కలాసే...", "ఐడెంట్ వాంట్ లవ్.." పాటలు బాగానే ఉన్నా సంగీతం పదాలను మింగేసింది. మిక్సింగ్ విషయంలో కాస్త జాగ్రత్తపడి ఉంటే సరిపోయేది.

మొత్తంమీద తొలి భాగం వినోదాత్మకంగా, మలిభాగం యాక్షన్ ప్రదానంగా సాగే ఈ చిత్రానికి కిక్ అనే పేరు చక్కగా సరిపోయింది. గతంలో అర్జున్ నటించిన జెంటిల్‌మెన్ లైన్‌లో సాగుతూ రెడీ తరహాలో వినోదాన్ని కలబోసినట్టపించడం కిక్ ప్రత్యేకత. మరో నెలవరకు పెద్ద చిత్రాలేవీ విడుదలయ్యే అవకాశం లేకపోవడంతోపాటు పోటీ చిత్రాలు సైతం లేకపోవడం వల్ల కిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

(మూలం - వెబ్‌దునియా)
1| 2
 
మరిన్ని...
అర్థంకాని కథతో ఆకట్టుకోని 'మిత్రుడు'
గజిబిజి కథతో...రొటీన్ చిత్రం వీడొక్కడే
రాష్ట్రానికి మంచి చేయాలనుకునే అధినేత
ఆనందం తక్కువైన ఆనంద తాండవం
ప్రభాస్ "బిల్లా" రివ్యూ
మారణహోమాన్ని అడ్డుకునే 'మనోరమ'
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
రెహ్మాన్‌కు ఆత్మీయ సత్కారం: సుశీల
స్లమ్‌డాగ్ మిలీయనీర్ చిత్రానికిగాను రెండు ఆస్కార్ అవార్డులు సాధించిన సంగీత...
డబ్బింగ్ కార్యక్రమాల్లో రామ్‌దేవ్
కొత్తపాటతో సరికొత్తగా రానున్న మిత్రుడు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...