|
| రవితేజ మార్కుతో ఆకట్టుకునే 'కిక్' |
| ఆదివారం, 10 మే 2009 ( 15:04 IST ) | |
రవితేజ చిత్రమంటేనే అటు వినోదం, ఇటు యాక్షన్ కలగలసి ఉంటుందని ఊహించే ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిన చిత్రం కిక్. రవితేజ, ఇలియానాలు కలిసి నటించిన ఈ కిక్ చిత్రం ఆధ్యంతం సరదాగా సాగిపోతూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసిందని చెప్పవచ్చు.
నటీనటులు: రవితేజ, ఇలియానా, శ్యామ్, కోటశ్రీనివాసరావు, అషిక, బ్రహ్మానందం, వేణుమాధవ్, షిండే, అలీ తదితరులు.
సాంకేతికవర్గం: నిర్మాత- వెంకట్, సినిమాటోగ్రఫీ- రసూల్ ఎల్లోర్, పాటలు- రామజోగయ్య శాస్త్రి, సంగీతం- ఎస్.ఎస్. థామసత్, దర్శకత్వం- సురేందర్ రెడ్డి.
రవితేజ చిత్రాలంటేనే చాలా హుషారుగా ఉండి పెద్దలతోపాటు పిల్లలను కూడా ఎంటర్‌టైన్ చేసేలా ఉంటాయన్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన కిక్ సినిమా సైతం అలాంటిదేనని చెప్పవచ్చు. కిక్ చిత్రం దొంగా పోలీస్ కథ. శ్రీనువైట్ల చిత్రాల తరహాలో ఢీ, రెడీ సినిమా ఫార్మెట్‌లో కామెడీని చొప్పించి ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు కిక్ చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి.
కథ: కిక్ చిత్రం మలేషియా బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. రొటీన్‌గా కాకుండా ఏ పనిచేసినా అందులో కిక్ ఉండాలనుకునే కళ్యాణ్ (రవితేజ) తన విలక్షణమైన గుణంతో నైనా (ఇలియానా)ను ఆకర్షిస్తాడు. దీంతో ఇద్దరూ ప్రేమలో పడతారు. అయితే కళ్యాణ్ ధోరణి నచ్చని నైనా చివరికి అతనికి దూరమవుతుంది.
మరోవైపు సిన్సియర్ పోలీసు అధికారి కళ్యాణ్ కృష్ణ (శ్యామ్) పెళ్లిచూపుల కోసం మలేషియా వస్తాడు. అతని పేరులోనూ కళ్యాణ్ ఉండడంతో తనకు పరిచయమైన కళ్యాణ్ (రవితేజ) గురించి నైనా అతడితో చెబుతుంది. అదే సందర్భంలో తనను ముప్పుతిప్పలు పెట్టిన ఓ దొంగ గురించి కృష్ణ సైతం ఆమెకు చెబుతాడు.
| | (మూలం - వెబ్‌దునియా) |
|
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|