యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం సినిమా చూద్దాం
అర్థంకాని కథతో ఆకట్టుకోని 'మిత్రుడు'
సోమవారం, 4 మే 2009   ( 15:37 IST )
Balakrishna
PC
చాలాకాలంగా హిట్స్ లేకుండా మొహం వాచిన బాలకృష్ణకు తాజా చిత్రం మిత్రుడు సినిమాతోనైనా విజయం మరోసారి తలుపు తడుతుందేమోనని ఎదురుచూసిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. అటు తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తునే విరామంలో బాలకృష్ణ నటించిన మిత్రుడు చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిందన్నది ట్రేడ్ వర్గాల అంచనా.

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, ప్రియమణి, రంగనాథ్, చంద్రమోహన్, దీపక్, కృష్ణభగవాన్, ప్రదీప్ రావత్, బాలయ్య, బ్రహ్మానందం, హేమ, చలపతిరావు తదితరులు.

సాంకేతికవర్గం: సంగీతం- మణివర్మ, నిర్మాత- శివలెంక కృష్ణ ప్రసాద్, దర్శకుడు- మహాదేవ్.

పాయింట్: జాతకం కంటే విల్‌పవర్ గొప్పదని చెప్పే పాయింట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది.

ఈ చిత్రం చూశాక దీనికి మిత్రుడు అనే టైటిల్ ఎందుకు పెట్టారో అర్థం కాదు. ఏమాత్రం కథాబలంలేకుండా సాగదీతగా సాగే ఈ చిత్రం అప్పట్లో ఎన్టీఆర్ నటించిన కలియుగ పురుషుడును గుర్తుకు తెస్తుంది. జాతక బలంపై ఇప్పటికే చాలా చిత్రాలూ రాగా తాజాగా అదే పాయింట్‌తో వచ్చిన మిత్రుడు చిత్రం నేటి ట్రెండ్‌కు తగినట్లుగా లేకపోవడం గమనార్హం.

కథ: మలేషియాలో ఉంటున్న ఆదిత్య (బాలకృష్ణ), తన వారినందరినీ పోగొట్టుకున్న దుఃఖంలో మందుకు బానిసగా మారుతాడు. ఇలాంటి వ్యక్తిని అక్కడే చదువుతున్న ఇందు (ప్రియమణి) బలవంతంగా ప్రేమిస్తుంది. దానికీ ఓ కారణముంటుంది. తన జాతకచక్రం ప్రకారం మొదటి మొగుడు చనిపోతాడు కాబట్టి ఎలాగూ జీవితంపై విరక్తి కలిగిన ఆదిత్యను ట్రాప్‌చేసి పెళ్ళి చేసుకుని ఆ తర్వాత తనకు పరిచయమున్న మధు (దీపక్)ను ఎంచక్కా పెండ్లిచేసుకోవచ్చునన్నది ప్రియామణి ప్లాన్.

ఈ విషయాన్ని తన నాన్న రంగనాథ్‌కు కూడా చెప్పకుండానే ఆదిత్యను పెళ్లి చేసుకుంటుంది ఇందు. పెళ్ళయిన తర్వాత మధుతో ఇండియా బయలుదేరుతుంది ఇందు. అయితే ఈ విషయాన్ని తెల్సుకున్న ఆదిత్య వారితోనే ఇండియాకు వచ్చి వారికి షాక్ ఇస్తాడు. ఇక ఆ తర్వాత అక్కడ నుంచి రకరకాల ట్విస్ట్‌లతో కథ సాగుతుంది. ఇలాంటి తరుణంలో అనాధగా మిగిలిన ఆదిత్యను అల్లుడిగా ససేమిరా అంటాడు రంగనాథ్.


(మూలం - వెబ్‌దునియా)
1| 2
 
మరిన్ని...
గజిబిజి కథతో...రొటీన్ చిత్రం వీడొక్కడే
రాష్ట్రానికి మంచి చేయాలనుకునే అధినేత
ఆనందం తక్కువైన ఆనంద తాండవం
ప్రభాస్ "బిల్లా" రివ్యూ
మారణహోమాన్ని అడ్డుకునే 'మనోరమ'
నేటి రాజకీయాల చుట్టూ తిరిగే 'మేస్త్రీ'
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
నారా రోహిత్ హీరోగా అశ్వనీదత్ భారీ చిత్రం!
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు...
దాసరి జన్మదినం: కార్మికులకు సన్మానం
సస్పెన్స్ థ్రిల్లర్‌గా నేనున్నా.. నీకోసం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...