యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం సినిమా చూద్దాం
రాష్ట్రానికి మంచి చేయాలనుకునే అధినేత
సోమవారం, 27 ఏప్రిల్ 2009   ( 12:13 IST )
Adhinetha
PC
జగపతిబాబు హీరోగా, శ్రద్ధాదాస్, హంసానందినిలు జంటగా తాజాగా తెరమీదకు వచ్చిన చిత్రం అధినేత. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కి వివిధ కారణాల రీత్యా ఎన్నికలముందు విడుదల కాకుండా ఆలస్యమైన ఈ చిత్రం ఎన్నికలు పూర్తయిన వెంటనే విడుదల కావడం విశేషం.

తారాగణం- జగపతిబాబు, శ్రద్ధాదాస్, హంసానందిని, నీలిమ, పరుచూరి గోపాలకృష్ణ, శివపార్వతి, కృష్ణభగవాన్, చిత్రం శ్రీను తదితరులు.

సాంకేతికవర్గం- కెమేరా- ప్రసాద్ బాబు, ఎడిటింగ్- నందమూరి హరి, సంగీతం- శ్రీకాంత్ దేవా, నిర్మాత- కె.కె. రాధామోహన్, దర్శకత్వం- వి. సముద్ర.

పాయింట్- మంచితన కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే అతనివల్ల రాష్ట్రానికి ఎలాంటి మంచి జరుగుతుందనేది సినిమా ఇతివృత్తం.

కథ- మధ్య తరగతి కుటుంబానికి చెందిన సూరిబాబు (జగపతిబాబు) కనీసం డిగ్రీకూడా పాస్‌కాడు. దీంతో ఉద్యోగం లేక స్నేహితుల బృందంతో ఊరంతా తిరుగుతుంటాడు. దీంతో అతని అక్కకూతురు సైతం పెళ్లి చేసుకోను పొమ్మని చీదరించుకుంటుంది. ఈ ఛీత్కారాన్ని సూరిబాబు సవాల్‌గా స్వీకరిస్తాడు.

ఇదిలా ఉంటే... సూరిబాబు జులాయిగా తిరుగుతున్నా అతనిలో చాలామంచితనం ఉంటుంది. ఎవరైనా ఎవరికైనా అన్యాయం చేస్తుంటే ఏ మాత్రం సహించలేడు. మరోవైపు సూరిబాబు ఉన్న ఊరికి నాయకుడిగా ఉండే వ్యక్తి ఎంఎల్.ఎ. శ్రీరాములు. సూరిబాబు నైజం ఆయనకు నచ్చి ఎప్పటికైనా రాజకీయనాయకుడువి అవుతావంటూ చెబుతుంటారు. ఇలాంటి సమయంలో సూరిబాబుకు ఏదో ఒక ఉద్యోగం ఇప్పించి అతడిని దారిలో పెట్టాలంటూ అతని తల్లితండ్రులు చలపతిరావు, అన్నపూర్ణలు ఎంఎల్ఏను కోరుతారు. దాంతో ముఖ్యమంత్రి ఆహుత్‌ప్రసాద్‌ పేషిలో సూరిబాబుకు శ్రీరాములు ఉద్యోగం ఇప్పిస్తాడు.

సీఎంకు వచ్చే ఉత్తరాలను చదివి తగువిధంగా పరిష్కరించే ఉద్యోగంలో చేరుతాడు సూరిబాబు. ఇందులో భాగంగానే ఓసారి స్నేహితుని చెల్లెలి మానాన్ని కాపాడుతాడు సూరిబాబు. మరోవైపు మహేంద్రభూపతి (ఆనంద్‌రాజ్) ఆ ఊరిని శాసించే వ్యక్తి. సీఎంకు మంచి స్నేహితుడు. అతని తమ్ముడు అమ్మాయిల్ని ఏడిపించడం, ఆఖరికి విజయవాడ అయేషా హత్యలాగా హాస్టల్లో చదువుకుంటున్న స్నేహితుని చెల్లెల్లి చెరచి చంపేస్తే.. వాడిమీద ప్రతీకారం తీర్చుకుంటాడు సూరిబాబు.

ఇది తెలిసిన మహేంద్రభూపతి సూరిబాబును జైళ్లో పెట్టిస్తాడు. సూరిబాబు మంచితనాన్ని తెలుసుకుని ఎం.ఎల్. శ్రీరాములు బెయిల్ ఇప్పించడమే కాకుండా, అన్యాయాలు చేసేవారిని ఆదుకున్న సీఎం ఆహుతిప్రసాద్‌కు వార్నింగ్ ఇస్తాడు. దాన్ని అవమానంగా భావించి శ్రీరాములును సీఎం చంపించేస్తాడు. అప్పటికే ఊర్లో సూరిబాబు పేరు మారుమోగిపోవడంతో అతని స్నేహితులు సూరిబాబుకు తెలీయకుండా ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేయిస్తారు. దీంతో ఆగ్రహించిన సీఎం సూరిబాబును ఉద్యోగం పీకేస్తాడు.

చివరికి శ్రీరాములు ఆఖరికోరిక ప్రకారం సూరిబాబు రాజకీయాలపై దృష్టిపెడతాడు. ప్రత్యర్థుల నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటాడు. ఎమ్మెల్యేగా నెగ్గడమేగాకుండా తనలాంటి ఇండిపెండెంట్‌లు అయిన 25 మందిని పి.డి.ఎఫ్ పేరుతో తనవైపే తిప్పుకుంటాడు. జరిగిన ఎన్నికల్లో ఎవరికీ సరైన మెజారిటీ రాకపోవడంతో 25 మంది కీలకమవుతారు. ప్రతిపక్షం, రూలింగ్ పార్టీ అధినాయకులు సూరిబాబును తమవైపు తిప్పుకోవాలనుకుంటారు. కానీ శ్రీరాములు భార్య మటుకు సూరిబాబును సీఎం చేస్తే ఎవరికైనా సపోర్ట్ ఇస్తామని ప్రకటిస్తుంది.
(మూలం - వెబ్‌దునియా)
1| 2
 
మరిన్ని...
ఆనందం తక్కువైన ఆనంద తాండవం
ప్రభాస్ "బిల్లా" రివ్యూ
మారణహోమాన్ని అడ్డుకునే 'మనోరమ'
నేటి రాజకీయాల చుట్టూ తిరిగే 'మేస్త్రీ'
సహనానికి పరీక్ష... 'నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్'
ఛార్మీ అభిమానులకు అందాల విందు '16డేస్'
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
యదార్థ సంఘటన ఆధారంగా ఊహాచిత్రం
వంశీకృష్ణ, కావేరీఝా హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ఊహాచిత్రం. పూనెలో జరిగిన యధార్థ...
సాగర్‌లో షూటింగ్ కోసం పాండవులు
విడుదలకు సిద్ధమైన చలో వన్ టూ త్రీ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...