|
| ఆనందం తక్కువైన ఆనంద తాండవం |
| శనివారం, 11 ఏప్రిల్ 2009 ( 17:07 IST ) | |
అపరిచితుడు, సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రాలను అందించిన ఆస్కార్ ఫిలింస్‌నుంచి వచ్చిన మరో చిత్రం ఆనందతాడవం. భిన్నమైన కథాంశాలతో తన గత చిత్రాలను రూపొందించిన ఆస్కార్ ఫిలింస్ సంస్థ తన తాజా చిత్రం ఆనందతాండవాన్ని కూడా విభిన్నమైన కథతోనే రూపొందించింది. అయితే ఈ చిత్రం ద్వితీయార్థం విషాదంతో ముగియడం గమనార్హం.
నటీనటులు: తమన్నా, సిద్ధార్ధ, రిషభ్, రిషి, చార్లి, రుక్మిణి తదితరులు.
సాంకేతికవర్గం: నిర్మాత.. రవిచంద్రన్, మాటలు- శశాంక్ వెన్నెలకంటి, పాటలు- వనమాలి, సుద్దాల అశోక్ తేజ, భువన చంద్ర, సినిమాటోగ్రఫీ- జీవా శంకర్, సంగీతం- జి.వి.ప్రకాష్ కుమార్, దర్శకత్వం- గాంధీకృష్ణ.
పాయింట్: ప్రేమకోసం పెద్దల్ని ఎదిరించే యువకుడు, పెద్దల కోసం వేరే వ్యక్తిని పెండ్లాడే యువతి మధ్య జరిగే కథాకమామిషే ఆనందతాండవం. ప్రేమ విషయంలో పిల్లలు, పెద్దలు ఏం చేస్తున్నారో? ఒక్కసారి ఆలోచించండనే సందేశాన్ని దర్శకుడు ఈ చిత్రం ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.
కథ: ప్రతి విషయాన్ని ఈజీగా తీసుకునే మధుమిత (తమన్నా)కు, మెకానికల్ ఇంజనీర్ అయిన రఘుపతి (సిద్ధార్థ)తో పరిచయం ప్రేమగా మారుతుంది. తమన్నా తండ్రి గోపినాథ్. కొంచెం విశాలదృక్పథాలున్న వ్యక్తి. గోపినాథ్ రికమండేషన్ వల్ల రఘుపతికి ఉద్యోగం వస్తుంది.
ఇక మధుమిత, రఘుపతిల పెళ్ళే తరువాయి అనుకున్న సమయంలో గోపీనాథ్ మాటమార్చి అమెరికా సంబంధమంటూ రాధాకృష్ణ అనే వ్యక్తితో మధుమతికి పెళ్లి చేయాలని నిశ్చయిస్తాడు. దీంతో తీవ్రమనస్థాపానికి గురైన రఘుపతి చనిపోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఊహించనివిధంగా గోపీనాథ్ డ్రైవర్ రఘుపతిని కాపాడతాడు.
ప్రేమలో విఫలమైన రఘుపతికి, అతడి తండ్రి ధైర్యం చెప్పి అమెరికా పంపిస్తాడు. అక్కడ రఘుపతికి మాజీ ప్రియురాలు కన్పిస్తుంది. ఆ తర్వాత కథ వివిధ మలుపులు తిరుగుతుంది. అవి ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
విశ్లేషణ: నటీనటుల విషయానికి వస్తే అమాయకత్వంతో కూడిన చిన్నపిల్ల మనస్తత్వంలో తమన్నా బాగా నటించింది. డాన్స్ బాగా చేసింది. నూతన నటుడు రిషభ్ హావభావాలు ఇంకా మెరుగుపర్చుకోవాల్సివుంది. మధుమతి తనకు దక్కదనుకున్న సన్నివేశంలో అతను ఇంకాస్త బాగా నటించి ఉండాల్సింది. ఇక రెండో హీరోయిన్ రుక్మిణి డాన్స్ పరంగా బాగానే చేసింది. కానీ నటనలో మాత్రం మెప్పించలేకపోయింది.
టెక్నికల్ పరంగా చూస్తే ఈ చిత్రంలో స్క్రీన్‌ప్లేలో కొద్దిగా లోపం ఉన్నట్టే కన్పిస్తుంది. కథనం బాగా నీరసంగా సాగే కారణంగా టైటిల్‌లోని ఆనందం కాస్తా డల్‌గా మారింది. అయితే కెమేరా పనితనం మాత్రం మెచ్చుకోదగిందిగా ఉంది. తమిళ దర్శకుడు శంకర్ శిష్యుడైన గాంధీకృష్ణ డైరక్షన్ మాత్రం చాలా బాగుందనే చెప్పవచ్చు.
తల్లిదండ్రులు, స్నేహితుల నిర్ణయాలకే ప్రాధాన్యత ఇస్తే, వారి జీవితం ఎలా పరిణమిస్తుందనే విషయాన్ని తమన్నా పాత్ర ద్వారా దర్శకుడు చక్కగా చూపించారు. అదేవిధంగా పెద్దల్ని కాదని పెండ్లి చేసుకుంటే కొన్ని తిప్పలు తప్పవని రఘుపతి పాత్ర ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తం మీద అత్యాశతో విదేశాలపై మోజు పడకూడదనే విషయాన్ని దర్శకుడు ఈ చిత్రం ద్వారా చూపించారు.
మొత్తంగా ఈ చిత్రంలో విషాదం పాళ్ళు ఎక్కువ కావడంతో ప్రేక్షకుడిలో ఆనందం తగ్గింది. తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్.వి.ఆర్. క్రియేషన్స్ విడుదల చేసింది. ఆస్కార్ బేనర్‌లో వచ్చిన గత చిత్రాలతో పోలిస్తే ఇది కాస్త నిరాశను కలిగిస్తుందనే చెప్పవచ్చు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|