యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం సినిమా చూద్దాం
మారణహోమాన్ని అడ్డుకునే 'మనోరమ'
శనివారం, 28 మార్చి 2009   ( 17:36 IST )
Charmi
PC
ఓ పాయింట్‌ను ఆధారంగా చేసుకుని దానిచుట్టూ కథను అల్లే తరహా సినిమాలు మన తెలుగులో ఇప్పుడిప్పుడే చోటు చేసుకుంటున్నాయి. అలాంటి కోవలోనే తాజాగా ఛార్మి ప్రధాన పాత్రలో వచ్చిన మనోరమ సినిమాను కూడా చెప్పవచ్చు. జీ మోషన్ నిర్మించిన ఈ మనోరమ చిత్రం ఇటీవల వచ్చిన గమ్యం, మంత్ర, 16 డేస్, సరోజ వంటి చిత్రాల తరహాలోనే తక్కువ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

మీ శ్రేయోభిలాషి చిత్రం ద్వారా తన ప్రతిభను నిరూపించుకున్న ఈశ్వర్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం ఈ చిత్ర విశేషం.

నటీనటులు
ఛార్మి, నిషాల్, శ్రీధరరావు, ప్రదీప్, లహరి, సునయన, శ్రీవాత్సవ, ఎం.ఎస్. నారాయణ, విశ్వేశ్వరరావు.

సాంకేతిక వర్గం
పతాకం- జీ మోషన్ పిక్చర్స్,
ఎగ్జిక్యూటివ్ నిర్మాత- సురేష్,
నిర్మాత- గోయెంకా,
కథ, స్క్రీన్‌ప్లేస దర్శకత్వం- ఈశ్వరరెడ్డి.

పాయింట్
మతం పేరుతో జరుగుతున్న మారణహోమంతో, మానవ మనుగడకు ఎలాంటి ప్రమాదం కలుగుతుందన్నదే మనోరమ చిత్ర కథాంశం.

తన తొలిచిత్రం మీ శ్రేయోభిలాషిలో చావడానికి సిద్ధమైన ఓ యువకుడు, ఓ నిర్మాత... ఇలా కొంతమంది వ్యక్తుల చుట్టూ కథను అల్లి కొత్త తరహా కథను అందించిన దర్శకుడు తన మలి ప్రయత్నంలో ఈ మనోరమ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తొలిచిత్రం తరహాలోనే ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా ఉన్న బాంబు పేలుడు ఘటనల పాయింట్‌ను ఎంచుకుని మనుష్యుల్లో మానవత్వాన్ని తట్టిలేపే ప్రయత్నం చేశారు.

కథ
జీవితమంటేనే ఎంజాయ్ అని బతికినన్ని రోజులు సరదాగా గడుపుదామనుకునే గీతాంజలి ఉరఫ్ గిల్లీ (ఛార్మి) తన ఆలోచనల్లో భాగంగా ప్రేమించి పెళ్ళిచేసుకుని హైదరాబాద్‌లో ఉంటున్న స్నేహితురాలైన ప్రియ, రాహుల్ ఇంటికి వస్తుంది. తన స్నేహితురాలు, ఆమె భర్త ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కావడంతో వారు ఉదయం ఆఫీసుకు వెళ్ళగానే తాను మాత్రం ఆ ఇంట్లోనే ఉంటుంది.

ఛార్మి ఉండే ఇల్లు హైదరాబాద్‌లోనే బాగా రద్దీగా ఉండే కోటి సెంటర్. ఆ ఇంటికి ఎదురుగా మనోరమ అనే పానీపూరీ హోటల్ ఉంటుంది. అక్కడికి వచ్చేవారిని తన బైనాక్యులర్‌తో గీతాంజలి పరిశీలిస్తుంటుంది. రకరకాల వ్యక్తుల్ని పరిశీలించి వారి లిప్ రీడింగ్, ఫేస్ రీడింగ్ తెలుసుకోవడమనేది ఛార్మి అలవాటు కావడంతో అదే కోణంలో పానీపూరీ హోటల్‌కు వచ్చేవారిని పరిశీలిస్తుంటుంది.


(మూలం - వెబ్‌దునియా)
1| 2
 
మరిన్ని...
నేటి రాజకీయాల చుట్టూ తిరిగే 'మేస్త్రీ'
సహనానికి పరీక్ష... 'నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్'
ఛార్మీ అభిమానులకు అందాల విందు '16డేస్'
ఉగ్రవాదం చుట్టూ తిరిగే సత్యమేవ జయతే
ప్రేమికులకు నచ్చే కొంచెం ఇష్టం కొంచెం కష్టం
ప్రేక్షకులను ఆకట్టుకోలేని మస్త్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
మార్చి 31నుంచి ప్రభాస్-పూరీల కొత్త చిత్రం
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా, డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపు...
మహేష్‌బాబుతో త్రివిక్రమ్ చిత్రం ప్రారంభం
త్రిష హీరోయిన్‌గా ఆకాశమంత ఆడియో
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...