యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం సినిమా చూద్దాం
సహనానికి పరీక్ష... 'నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్'
సోమవారం, 9 మార్చి 2009   ( 12:11 IST )
Na girl friend baga rich
PC
కథలో బలం లేకుండా ఓ చిత్రాన్ని రూపొందిస్తే చూసే ప్రేక్షకుడి ఆ చిత్రం సహనానికి ఎంతటి పరీక్ష పెడుతోందో చెప్పేందుకు నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ చిత్రం ఓ చక్కని ఉదాహరణ. ఇంగ్లీష్, హిందీ సినిమాలను అనుకరించడమే పనిగా పెట్టుకుని చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పకపోతే చివరకు చిత్రం ఎలా తయరవుతుందో ఈ చిత్రం చూస్తే బాగా అర్థమవుతుంది.

నటీనటులు:
శివాజీ, కావేరీ ఝూ, బ్రహ్మానందం, ఆహుతీప్రసాద్, బబ్లూ, విజయ్, రమాప్రభ తదితరులు

సాంకేతిక వర్గం:
కెమెరా- మారో, సంగీతం- ఆనంద్, ఎడిటింగ్- ఉపేంద్ర, నిర్మాతలు- కుమార్ బ్రదర్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- ఎం. నాగేంద్రకుమార్.

కథ:
సంజయ్‌శాస్త్రి (శివాజీ) బాగా చదువుకున్న కుర్రాడు, గోల్ఫ్ ఆటలో ఛాంపియన్. అయితే ఇతనికి గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనేది పెద్ద కోరిక. ఈ కోరికలో భాగంగా తిరుగుతుండే హీరోకి ఓ సందర్భంలో శ్రావ్య (కావేరీ ఝూ) పరిచయమవుతుంది. అమెరికాకు చెందిన శ్రావ్య సంగీతం నేర్చుకోవడం కోసం ఇండియాకు వస్తుంది. అలా వచ్చిన ఆమెకు హీరో పరిచయం కావడం అతనితో ప్రేమలో పడడం జరుగుతుంది.

ఈ నేపథ్యంలో అమెరికాలో ఉన్న తన తల్లితండ్రులు బ్యాంకాక్ వస్తున్నారని తెలియడంతో వారికి తన బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేయడం కోసం హీరోతో పాటు శ్రావ్య బ్యాంకాక్ బయలుదేరుతుంది. ఈ ప్రయాణంలో మైక్‌టైసన్ (బ్రహ్మానందం) వీరికి తారసపడుతాడు. అనుకోని సందర్భంలో బ్రహ్మానందం, శివాజీల బ్యాగ్‌లు మారిపోతాయి. అయితే శివాజీ వద్దకు చేరిన బ్రహ్మానందం బ్యాగ్‌లో ఏడు తలలు ఉండడంతో శివాజీ చిక్కుల్లో పడతాడు.

ఇక ఆపైన శివాజీ ఆ చిక్కుల నుంచి ఎలా బయటపడ్డాడు. ఈ సందర్భంలో శ్రావ్య ఎలా స్పందించింది అన్నదే మిగిలిన సినిమా.

విశ్లేషణ:
ముందుగా చెప్పుకున్నట్టు ఈ చిత్రంలోని కథలో ఏమాత్రం పసలేదు. ఇంగ్లీషు, హిందీ సినిమాల ప్రభావంతో తీసిన ఈ చిత్రంలో అసలు దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాదు. అలాగే హీరో పాత్ర కేవలం అలంకార ప్రాయమే. హీరోయిన్ సైతం డిట్టోనే. అందాలు ఆరబోయడానికి తప్ప హీరోయిన్ మరెందుకు ఉపయోగపడదు.

ఇక బిల్డప్ కోసం పెట్టిన బ్రహ్మానందం పాత్ర కూడా అంతే. మైక్‌టైసన్ పేరుతో బ్రహ్మానందం చేసిన పాత్రను బరించడం కూడా ప్రేక్షకులకు సవాలే. ఇలాంటి చిత్రంలో సాంకేతిక వర్గం ప్రతిభ కూడా అంతంత మాత్రమే. సంగీతం సైతం ఈ చిత్రానికి పెద్దగా ఉపయోగపడలేదు. విడుదలకు ముందు ఈ చిత్ర నిర్మాత అష్ట కష్టాలు పడ్డాడంటూ వచ్చిన వార్తలు నిజమో కాదో తెలియదు కానీ ఈ చిత్రం చూసే ప్రేక్షకులకు మాత్రం కష్టాలు తప్పవు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఛార్మీ అభిమానులకు అందాల విందు '16డేస్'
ఉగ్రవాదం చుట్టూ తిరిగే సత్యమేవ జయతే
ప్రేమికులకు నచ్చే కొంచెం ఇష్టం కొంచెం కష్టం
ప్రేక్షకులను ఆకట్టుకోలేని మస్త్
ఫ్యాక్షన్ నేపధ్యంలో మస్కా
కొత్తదనం కోసం ప్రయత్నం... శశిరేఖా పరిణయం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
విడుదలైన సమర్థుడు చిత్రం ఆడియో
కృష్ణంరాజు, రాజా, సంజనలు ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న సమర్థుడు చిత్రం...
కొత్తవారితో 'టు-లెట్' షూటింగ్ ప్రారంభం
పుట్టినరోజు సంబరాల్లో కమిలినీ ముఖర్జీ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...