|
| ఛార్మీ అభిమానులకు అందాల విందు '16డేస్' |
| శనివారం, 21 ఫిబ్రవరి 2009 ( 17:33 IST ) | |
తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం 16డేస్. మొత్తం తమిళంలోనే చిత్రీకరించిన ఈ చిత్రంలో కొన్ని కామెడీ సన్నివేశాలు మాత్రమే తెలుగువారితో చిత్రీకరించారు. దీంతో ఈ చిత్రం తమిళ డబ్బింగ్ చిత్రం చూస్తున్నట్టుగా ఉంటుంది. తమిళంలో 'లాడమ్' పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేశారు.
నటీనటులు: అరవింద్, ఛార్మీ, కోట, ధర్మవరపు సుబ్రమణ్యం, రామిరెడ్డి, కోటశ్రీనివాసరావు తదితరులు
సాంకేతిక వర్గం: కెమెరా- సుకుమార్, మాటలు- నివాస్, సంగీతం- ధరణ్, దర్శకత్వం- ప్రభు సాల్మన్.
పాయింట్: మొత్తం 16 రోజుల్లో జరిగే సన్నివేశాల ఆధారంగా ఈ చిత్రం కథ నడుస్తుంది.
కథ: ఉద్యోగం కోసం గ్రామం నుంచి పట్టణానికి వచ్చే గురుమూర్తి (అరవింద్) అనుకోకుండా ఓ మాఫియా మూఠాకు చిక్కుతాడు. ఈ మాఫియా ముఠాకు నాయకుడు పావడా యాదగిరి (కోటశ్రీనివాసరావు). తన ప్రత్యర్థి కొడుకును చంపేందుకు అతడిని పట్టుకు రమ్మని తనవారికి పురమాయిస్తాడు యాదగిరి. అలా యాదగిరి ప్రత్యర్థి కొడుకు కోసం వెళ్లిన యాదగిరి మనుషులు పొరబాటున గురుమూర్తిని తీసుకువస్తారు.
ఈ విషయాన్ని గ్రహించిన గురుమూర్తి యాదగిరి బారినుంచి తప్పించుకోవడానికి అతనికి ఓ సలహా ఇస్తాడు. అయితే సలహా చెప్పిన గురుమూర్తి యాదగిరి దగ్గర మరింతగా ఇరుక్కుపోతాడు. తన ప్రత్యర్థి కొడుకును చంపేందుకు సలహా ఇచ్చిన గురుమూర్తినే ఆ పని చేయమంటూ యాదగిరి బెదిరిస్తాడు. దీంతో ఆ పనిమీద బయటకొచ్చిన గురుమూర్తి యాదగిరి ప్రత్యర్థి అయిన రామిరెడ్డి మనుషులకు గురుమూర్తి చిక్కుతాడు.
దీంతో రెచ్చిపోయిన రామిరెడ్డి గురుమూర్తిని సజీవంగా పాతి పెడుతాడు. అయితే తెలివిగా తప్పించుకున్న గురుమూర్తి రామిరెడ్డి చెరనుంచి బయటపడుతాడు. ఈ సమయంలో ఏంజెల్ (ఛార్మి) గురుమూర్తికి పరిచయం అవుతుంది. ఈ తరుణంలో అనాధ అయిన ఏంజెల్ గురించి తెలుసుకున్న గురుమూర్తి తన కథను ఆమెకు చెబుతాడు. దీంతో ఇద్దరూ ఒకరికొకరు సాయం చేసుకోవాలనే నిర్ణయానికి వస్తారు.
ఇంతలో 16రోజుల్లో తాను చేయాల్సిన బాధ్యత గురించి ఏంజెల్‌కు గురుమూర్తి చెబుతాడు. అటుపై గురుమూర్తి ఎలా తన కార్యాన్ని పూర్తిచేశాడు. ఈ పనిలో గురుమూర్తికి ఏంజెల్ ఎలా తోడ్పడింది అన్నదే మిగిలిన సినిమా.
విశ్లేషణ: ఈ చిత్రంలో ఛార్మిది ప్రధానపాత్ర అంటూ ప్రచారం జరిగినా సినిమాలో మొత్తం కథంతా అరవింద్ చుట్టూనే తిరుగుతుంది. కొత్తవాడైనా అరవింద్ నటనపరంగా మంచి మార్కులు సాధించాడు. ఇక ఛార్మి తెరపై తన అందాలు ఆరబోయడానికే ఎక్కువగా శ్రమించింది. ఇక ఈ చిత్రంలో ఇతర నటుల్ని అనుకరిస్తూ ఛార్మి చేసే విన్యాసాలు ఆకట్టుకోవు.
విలన్లుగా కోట, రామిరెడ్డిలు తమ పరిధి మేరకు రాణించారు. కామెడీలో ఒక్క ధర్మవరపు తప్పించి మిగిలినవారంతా తమిళ నటులే. ఈ చిత్రానికి ధరణీ అందించిన బాణీలు బాగానే ఉన్నాయనిపిస్తుంది. దర్శకుడిగా ప్రభు సాల్మన్ ఫర్వాలేదనిపించాడు. అయితే తొలి అర్థభాగంలో ఉన్నంత వేగం, ఆసక్తి రెండో అర్థబాగంలో ఉండవు.
దీంతో సినిమా చూసే ప్రేక్షకుడి సహనానికి కొంచెం పరీక్షే. మొత్తంగా తమిళ నుంచి డబ్బింగ్ చేయబడినట్టుగా ఉన్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏమేరకు రజింపజేస్తుందో వేచి చూడాల్సిందే.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|