|
| ప్రేమికులకు నచ్చే కొంచెం ఇష్టం కొంచెం కష్టం |
| శనివారం, 7 ఫిబ్రవరి 2009 ( 12:11 IST ) | |
సిద్దార్థ, తమన్నా జంటగా కిషోర్ కుమార్ దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మించిన చిత్రం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఇప్పటికే నువ్వొస్తానంటే నేవద్దంటానా, బొమ్మరిల్లు చిత్రాల్లో లవ్లీ బాయ్ గెటప్‌లో అలరించిన సిద్దార్థ మరోమారు ఈ చిత్రంలో అదే తరహా పాత్రలో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.
తమ ప్రేమను దక్కించుకోవడానికి అంతకుముందే విడిపోయిన తమ తల్లితండ్రులను కలపడమనేది ఈ చిత్రం కథలోని పాయింట్.
నటీనటులు: ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, నాజర్, సామ్రాట్, కరుణ, సుధ, బ్రహ్మానందం, వేణుమాధవ్, హేమ, సురేఖ తదితరులు నటించారు.
సాంకేతిక వర్గం: కెమెరా- విజయ్ సి. చక్రవర్తి, మాటలు- అబ్బూరి రవి, ఎడిటింగ్- శ్రీకరప్రసాద్, పాటలు- సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, సంగీతం- శంకర్- ఇషాన్- లాయ్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్- మణిశర్మ, నిర్మాత- నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి), స్క్రీన్‌ప్లే- విక్రమ్ సిరి, కథ, దర్శకత్వం- కిషోర్ కుమార్.
కథ: ఊరి పెద్ద సుబ్రమణ్యం (నాజర్) గారాల కూతురు గీత (తమన్నా)ను పై చదువుల కోసం సిటీకి పంపుతాడు. అక్కడ సిద్ధు (సిద్దార్థ) స్నేహితురాలైన కరుణ ఇంట్లోనే గీత దిగుతుంది. కరుణ తండ్రి గచ్చిబౌలి దివాకర్ (బ్రహ్మనందం). కరుణ వల్ల పరిచయమైన సిద్ధుతో గీత ప్రేమలో పడుతుంది. దీంతో గీతను పెళ్లి చేసుకుంటానని సుబ్రమణ్యంకు చెబుతాడు సిద్ధూ. అయితే సిద్ధూ తల్లితండ్రులు విడిపోయారని తెలుసుకున్న సుబ్రమణ్యం ఈ పెళ్లికి ససేమిరా అంటాడు.
అయితే సిద్ధూ మరీ రెట్టించి అడగడంతో నీ తల్లితండ్రులను కలిపగలిగితే తన కూతురునిచ్చి పెళ్లి చేస్తానంటూ చెబుతాడు సుబ్రమణ్యం. దీంతో తన తల్లి తండ్రులను కలపడానికి సిటీకి వచ్చిన సిద్ధూ తన తల్లితండ్రులను కలిపేందుకు చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ అవన్నీ బెడిసికొట్టడంతో తన తల్లితండ్రులను కలపడం తనవల్ల కాదంటూ సుబ్రమణ్యం దగ్గర చెప్పేస్తాడు సిద్ధూ. అప్పుడు సుబ్రమణ్యం ఏం చేశాడు. చివరకు సిద్ధూ తన తల్లితండ్రులను ఎలా కలిపాడన్నదే మిగిలిన సినిమా.
విశ్లేషణ: కాలేజీ విద్యార్ధిగా సిద్దార్ధ తన చెలాకీతనం, అల్లరితో మెప్పించాడు. తమన్నా సైతం తన పాత్రలో మెప్పించే ప్రయత్నం చేసింది. ఇక సిద్ధూ తల్లితండ్రులుగా చేసిన ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణలు తమ పాత్రలకు న్యాయం చేసే ప్రయత్నం చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అటుపై మాట పట్టింపులతో విడిపోయినా వీరి కొడుకైన సిద్ధూ అటు తల్లివద్ద, తండ్రి వద్ద పెరగడం విచిత్రంగా ఉంటుంది.
ఇక క్రికెట్ పిచ్చి కల్గిన వ్యక్తిగా బ్రహ్మానందం తన పాత్రతో వినోదాన్ని పంచే ప్రయత్నం చేశాడు. తనకున్న క్రికెట్ పిచ్చితో ఇతరులను ఇబ్బంది పెట్టే బ్రహ్మానందం పాత్ర వినోదాన్ని పంచుతుంది. హీరో స్నేహితుడిగా వేధవ్ సైతం కామెడీ పంచే ప్రయత్నం చేశాడు.
ఈ చిత్రంలోని ప్రథమార్థం కాలేజీ, ప్రేమ అంటూ మొత్తం యూత్‌ఫుల్‌గా సాగుతుంది. ద్వితియార్థంలో తల్లితండ్రులను కలిపేందుకు సిద్ధూ చేసే పనులతో సినిమా కాస్త సీరియస్‌గా సాగుతుంది. అయితే తల్లితండ్రులను కలిపే క్లైమాక్స్ సన్నివేశాలు మాత్రం అంత ఫీల్ ఉన్నట్టుగా అనిపించవు. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించిన శంకర్- ఇషాన్- లాయ్‌ల శ్రమ ఫలించిందని చెప్పవచ్చు. మొత్తం మీద ప్రేమ, సెంటిమెంట్ అంటూ సిద్దార్థ చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|