|
| ప్రేక్షకులను ఆకట్టుకోలేని మస్త్ |
| మంగళవారం, 27 జనవరి 2009 ( 12:34 IST ) | |
ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో శివాజీ, శివబాలాజీ, ఆంచల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం మస్త్. కుటుంబకథా చిత్రాల దర్శకుడిగా పేరుతెచ్చుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి, జీమోసన్ పిక్చర్స్ కలిసి చేసిన ఈ మస్త్ చిత్ర ప్రయోగం ప్రేక్షకులకి మాత్రం మస్త్ అందించలేకపోయింది.
ఈ చిత్రం పూర్తి సస్పెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని చిత్రం విడుదలకు ముందు దర్శక, నిర్మాతలు చెప్పినా చిత్రంలో వారు చెప్పిన విశేషాలేవీ కన్పించవు. ఈ చిత్రానికి మాటలు- మరుధూరిరాజా, కథ, సంగీతం, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం కృష్ణారెడ్డి.
కథ శివ (శివాజీ), పాండు (ఆలీ), బాలు (శ్రీనివాసరెడ్డి) స్నేహితులు. శివ మోడల్‌గా ఎదగాలని ఫోటోలు దిగుతుండగా కంట్లో రెటీనా దెబ్బతిని గుడ్డివాడవుతాడు. శివకు చూపు రావాలంటే 2లక్షలు ఖర్చవుతుందని డాక్టర్ చెబుతాడు. అలాగే బాలుకు పెద్ద సింగర్ కావాలన్నది కోరిక. ఓ సందర్భంలో బాలుకు స్వరపేటిక దెబ్బతింటుంది. ఇక పాండు ఎల్ఐసీ ఏజెంట్. స్నేహితుల లోపాలను బయటివారికి కన్పించకుండా సర్థుబాటు చేస్తుంటాడు.
వీళ్లంతా కలిసి బ్రహ్మానందంను మాయచేసి ఆయన ఇంట్లో అద్దెకు దికుతారు. ఇలాంటి సమయంలో ఓ రౌడీ అనుపమ (ఆంచల్) ప్రేమలో పడతాడు. ఆ రౌడీ బారినుంచి తప్పించుకోవడానికి అనుపమ అతనికి ఓ దిక్కుమాలిన పందెం పెడుతుంది. అయితే అందులో గెల్చిన ఆ రౌడీ అనుపమ కోసం వస్తాడు. దీంతో అతని నుంచి తప్పించుకోవడానికి పారిపోయిన అనుపమను కొందరు రౌడీలు వెంబడిస్తారు.
ఆ సమయంలో శివ ఆ రౌడీలనుంచి అనుపమను తప్పించి తన ఇంటికే తీసుకువస్తాడు. అలా శివ ఇంటికి చేరిన అనుపమ శివ అతని స్నేహితుల కష్టాలు తెల్సుకుని బాధపడుతుంది. వారికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నయం చేయించాలని చూస్తుంది. అలా తమపై అక్కర చూపిస్తున్న అనుపమపై శివ ప్రేమ పెంచుకుంటాడు. కానీ అనుపమకు అమెరికాలో దత్తు (శివబాలాజీ)అనే ప్రేమికుడు ఉన్నట్టు శివకు తెలుస్తుంది. ఇలాంటి తరుణంలో చివరకు ఈ కథ ఎలా ముగుస్తుందనేదే మిగిలిన సినిమా.
విశ్లేషణ ఈ చిత్రం ప్రేమ, స్నేహం, త్యాగం అనే అంశాలతో అల్లిన కథగా దర్శకుడు చెప్పినా ఆ విషయాలు చూపించడంలో ఎక్కడా శ్రద్ధ పెట్టలేదు. ప్రతి సన్నివేశం చూడడానికి ఏమాత్రం బాగుండదు. శివాజీ నటన సైతం సాదాసీదాగానే కన్పిస్తుంది. ఈ చిత్రంలో శివ పాత్ర కళ్లు లేకున్నా బైక్ తోలడం, రౌడీలను కొట్టడంలాంటివి చూచేవారికి విచిత్రంగా అన్పిస్తాయి.
బ్రహ్మానందం పాత్ర సైతం చాలా సాదాసీదాగా ఉంటుంది. ఏమాత్రం ఆకట్టుకోదు. సునీల్ పాత్ర సైతం ఏమాత్రం రక్తికట్టించదు. ఈ చిత్రంలోని సంగీతం సైతం తూతూ మంత్రంగానే సాగుతుంది. ఏపాటా ప్రేక్షకులను ఆకట్టుకోదు. చిత్రంలోని డైలాగులు సైతం సందర్భోచితంగా ఉండదు. భారీ ఖర్చుతో తీశారని చెప్పిన ఈ చిత్రంలో ఆ తరహా లక్షణాలేవీ కన్పించకపోవడమే మస్త్ చిత్రంలోని పెద్ద విశేషం.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|