|
| ఫ్యాక్షన్ కథతో ఆకట్టుకునే ప్రయత్నం మస్కా |
| శుక్రవారం, 16 జనవరి 2009 ( 11:55 IST ) | |
ఫ్యాక్షన్ కథాంశాలు కనుమరుగవుతున్న తరుణంలో బి. గోపాల్ మార్క్ యాక్షన్‌తో, ఎం.ఎస్.రాజు తరహా ప్రేమ కథతో తెరకెక్కిన చిత్రం మస్కా. సంక్రాంతి పండుగ సందర్భంగా తెరమీదకు వచ్చిన ఈ చిత్రంలో రామ్, హన్సిక, షీలాలు హీరోహీరోయిన్లుగా నటించగా మిగిలిన పాత్రల్లో సునీల్, ముఖేష్‌రుషి, ప్రదీప్ రావత్ ధర్మవరపు సుబ్రమణ్యం, కృష్ణభగవాన్, ఝాన్సీ, నరేష్, తెలంగాణ శకుంతల తదితరులు నటించారు.
ఈ చిత్రానికి మాటలు- పరుచూరి బ్రదర్స్, కథ- సూర్య, సంగీతం- చక్రి, పాటలు- కందికొండ, స్క్రీన్‌ప్లే, నిర్మాత- ఎం.ఎస్.రాజు, దర్శకత్వం- బి.గోపాల్.
కథ సింహాచలం (ముఖేష్‌రుషి), శివాజీషిండే (ప్రదీప్‌రావత్)లు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన ఎం.పి.లు. ఇద్దరూ ఒకే కేంద్రమంత్రివర్గంలో పనిచేస్తున్నా ఒకే మంత్రి పదవిని దక్కించుకోవడానికి ఇద్దరూ ప్రయత్నిస్తుంటారు. దీంతో వీరిద్దరు బద్దశత్రువులుగా ప్రవర్తిస్తుంటారు. ఇదిలా ఉండగా హీరో జాగర్లమూడి కృష్ణకాంత్ ఉరఫ్ క్రిష్ (రామ్) జులాయిగా తిరిగే యువకుడు. కనీసం డిగ్రీ కూడా పాస్‌కాక పోయినా తనకున్న తెలివితేటల్తో అందరికీ మస్కా కొట్టేసి కాలాన్ని వెల్లదీస్తుంటాడు.
అలాంటి క్రిష్ తనకున్న తెలివితేటల్తో అమెరికా వెళ్లి అక్కడే ఓ డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అవ్వాలని ఆలోచిస్తుంటాడు. ఇలాంటి తరుణంలో మంజు (షీలా) క్రిష్‌కు ఎదురవుతుంది. ఆమెరికా వెళ్లేందుకు షీలా వీసా కూడా సంపాదించిందన్న విషయం క్రిష్‌కు తెలియడంతో ఆమెను ఇంప్రెస్ చేసి ఆమెను ప్రేమలోకి దింపడానికి ప్రయత్నిస్తాడు.
ఇందుకోసం ఆమె వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తాడు. ఇలాంటి తరుణంలో తాను ప్రేమించేవాడు తనకోసం సిగరెట్, మందు మానేయాలని, అంతకుముందే ఓ అమ్మాయిని ప్రేమించి విడిపోయి ఉండాలనే కోరికతో మంజు ఉన్నట్టు క్రిష్ తెలుసుకుంటాడు. దీంతో తాను క్రేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో చదివానని అక్కడ తాను మీనాక్షి (హన్సిక) అనే అమ్మాయిని ప్రేమించానని మంజుతో చెప్తాడు క్రిష్. అయితే తాను మీనాక్షి నుంచి ఎందుకు విడిపోవాల్సి వచ్చింది కూడా చెప్పాడు క్రిష్.
ఇలా క్రిష్ అల్లిన కట్టు కథను నిజం చేస్తూ మీనాక్షి అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. మీనాక్షిని చూడగానే క్రిష్ ఆమెవైపు ఆకర్షితుడవుతాడు. దీంతో క్రిష్‌ను దక్కించుకోవడానికి మంజు తన ప్రేమ వ్యవహారాన్ని తండ్రి సింహాచలంకు చెబుతుంది. కూతురికి, క్రిష్‌కు పెళ్లి చేయాలని అందుకు అడ్డుగా ఉన్న మీనాక్షిని తప్పించాలని సింహాచలం ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో మీనాక్షి గురించి అసలు నిజం తెల్సుకుని సింహాచలం షాక్‌కు గురవుతాడు.
ఇంతకీ మీనాక్షి ఎవరు, ఆమెను గురించి తెలిసి సింహాచలం ఎందుకు భయపడ్డాడు. ఇలాంటి తరుణంలో క్రిష్ ఎలా తన సమస్యను పరిష్కరించుకున్నాడు అన్న అంశాలే మిగిలిన సినిమా.
విశ్లేషణ గత చిత్రాల్లో రామ్‌లో కన్పించిన ఎనర్జీ ఈ మస్కా చిత్రంలో అంతగా కన్పించలేదనే చెప్పవచ్చు. ఇద్దరు హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాల్లో రామ్ యాక్షన్ హీరో పవన్‌కళ్యాణ్‌కు అనుకరణలాగా ఉంటుంది. హీరోయిన్లు నటనలో ఫర్వాలేదనిపిస్తారు. రామ్‌కు ఫ్రెండ్‌గా సునీల్ పాత్ర కొంతవరకు కామెడీ పంచే ప్రయత్నం చేశాడు.
ఈ చిత్రంలోని సంగీతం అంతంతమాత్రమే. పాటలు సైతం అంతగా బాగోలేవు. చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు గోపాల్ మార్కుతో ఉన్నా కథాగమనానికి మాత్రం అంతగా సరిపోవు. మొత్తం మీద చాలారోజుల తర్వాత గోపాల్, ఎం.ఎస్.రాజు కాంబినేషన్‌లో చేసిన ఈ యాక్షన్ తరహా ప్రేమకథా చిత్రం ఏమేరకు ప్రేక్షకుల అభిమానం చూరగొంటుందో వేచిచూడాల్సిందే.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|