యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం సినిమా చూద్దాం
కొత్తదనం కోసం ప్రయత్నం... శశిరేఖా పరిణయం
3 జనవరి 2009   ( 12:28 IST )
Tharun, jenilia
PC
తరణ్ హీరోగా జెనీలియా హీరోయిన్‌గా కృష్ణవంశీ దర్శకత్వంలో నిర్మాత సుంకరమధుమురళీ నిర్మించిన చిత్రం శశిరేఖా పరిణయం. పల్లెటూరి నేపధ్యంలో సాగే కుటుంబ కథా చిత్రంగా ఈ శశిరేఖా పరిణయం చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు కృష్ణవంశీ.

చిత్రంలో తరుణ్ హీరో అయినా జెనీలియా పాత్రనే ఎక్కువగా హైలెట్ చేయడం ద్వారా టైటిల్‌కు న్యాయం చేశారనే చెప్పవచ్చు. ఇక కథా విషయానికి వస్తే ఓ పల్లెటూరిలో ఉన్నతమైన కుటుంబానికి పెద్ద ఆహుతీ ప్రసాద్. ఆయన భార్య తులసి. కుమార్తె శశిరేఖ (జెనీలియా). బాగా పెద్దదైన ఆ కుటుంబానికి ఆహుతీప్రసాద్ చెప్పిందే వేదం. అంతేకాదు ఆయన ముక్కోపి కూడా.

అలాంటి ఆయన ఓ రోజు రాజమండ్రిలో డిగ్రీ చదువుతున్న తన కూతురు శశిరేఖను అవసరంగా ఊరికి పిలిపిస్తాడు. దీనికి కారణం ఆయన శశిరేఖను ఓ ఎన్నారైకి ఇచ్చి పెళ్లి చేయాలనుకోవడమే. ఓ పెండ్లి కేసెట్‌లో శశిరేఖను చూచిన అభిమన్యు అనే సదరు ఎన్నారై ఆమెనే పెండ్లి చేసుకుంటానంటూ ఆహుతీ ప్రసాద్‌కు కబురు చేయడంతో పాటు తన పూర్తి వివరాలతో ఓ డీవీడీని ఆహుతీప్రసాద్‌కు పంపిస్తాడు.

అయితే శశిరేఖకు ఈ పెళ్లిలో ఇష్టం ఉండదు. కానీ తండ్రి బలవంతం మీద చివరకు పెళ్లికి అంగీకరిస్తుంది. అయితే అదేసమయంలో అభిమన్యు తండ్రి తన తండ్రి వద్ద ఇవ్వాల్సిన కట్నాన్ని ముక్కుపిండి మరీ వసూలు చేసిన విషయాన్ని తన మేనమామ ద్వారా తెల్సుకున్న శశిరేఖ ఆ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంటుంది. అంతే పెళ్లి దగ్గరపడే సమయానికి ఒంటిమీద ఉన్న ఏడువారాల నగలతో పాటు ఇంటినుంచి పారిపోతుంది.


(మూలం - వెబ్‌దునియా)
1| 2
 
మరిన్ని...
శ్రీనువైట్ల మరో మైండ్‌గేమ్ కింగ్
సినీ పరిశ్రమ ఇతివృత్తంగా నేనింతే చిత్రం
అందమైన అబద్ధంలో చేదు నిజం
కుబేరులు రివ్యూ
వినాయకుడు రివ్యూ
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...