|
| సినీ పరిశ్రమ ఇతివృత్తంగా నేనింతే చిత్రం |
దర్శకుడు కావాలనుకున్న ఓ వ్యక్తి కథే ఈ చిత్రం. గతంలో ఇదే తరహాలో కొన్ని చిత్రాలు వచ్చినా వాటికి ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. అయితే ఈ చిత్రంలో మాత్రం సినీ ఇండస్ట్రీ అంటే ఏమిటి? ఎలా ఉంటుంది..? హీరో పాత్ర, ఇతర పాత్రల తీరు తెన్నులును వాస్తవంగా చూస్తున్నట్లు అనిపిస్తుంది.
ఇక ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం పూరీ జగన్నాథ్ సమకూర్చగా, డీవీవీ దానయ్య నిర్మించారు. సంగీతం చక్రి సమకూర్చగా, స్టంట్స్ రామ్‌లక్ష్మణ్‌లు అందించారు. ఈ చిత్రంలో నటీనటులుగా...రవితేజ, శియ (తొలి పరిచయం), రమాప్రభ, షాయాజీ షిండే, సుబ్బరాజు, బ్రహ్మానందం, ముమైత్ ఖాన్, రియా, కృష్ణభగవాన్, సురేఖారాణి, సుప్రీత్, వేణుమాధవ్, సత్యం రాజేష్, సాయిరామ్ శంకర్, రాజా రవీంద్ర తదితరులు.
కథలోకి వెళితే.. షూటింగ్ ప్రారంభంతో సినిమా ప్రారంభమవుతుంది. ఇడ్లీ విశ్వనాథ్ (బ్రహ్మానందం) దర్శకుడు. అతని కింద పనిచేస్తున్న కొంతమంది అసిస్టెంట్లలో రవి (రవితేజ) ఒకడు. రవి దర్శకుడు అవ్వాలని అనుకుంటు ఉంటాడు. ఆ చిత్రంలో హీరో మల్లిక్ (సుబ్బరాజు). హీరోయిన్ ముమైత్ (ముమైత్ ఖాన్). వీరిపై డ్యాన్స్ షాట్ చిత్రీకరిస్తుంటారు.
గ్రూప్ డ్యాన్సర్లలో అమ్మాయి సంధ్య (శియ) ఉంటుంది. డ్రెస్ విషయంలో గొడవపడుతుంది. ఆ తర్వాత కొన్ని పరిణామాలు సంఘటనలు ఈ క్రమంలో రవి, సంధ్యల మధ్య ప్రేమ చిగురిస్తుంది. సంధ్య అక్కబావలు కృష్ణభగవాన్. సురేఖ రాణి. డ్యాన్సర్ అయిన సురేఖ రాణిని కృష్ణభగవాన్ పెళ్ళి చేసుకుని ఆమె సంపాదనపై ఆధారపడుతూ మరదలి అందాన్ని కూడా క్యాష్ చేసుకోవాలని చూస్తుంటాడు.
మరోవైపు రవి తల్లి రమాప్రభ. కేన్సర్ రోగి. తన కొడుకు దర్శకుడు కాకపోతాడా? వాడి పేరు చూసుకోక పోతానా? అని ఎదురుచూస్తుంటుంది. ఈ సమయంలో ఆ వీధిలో ఒక రౌడీ హత్య చేస్తుండగా సంధ్య చూస్తుంది. ఆమెను చూసిన రౌడీ ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకుంటాడు.
మధ్యలో సంధ్య-రవిల ప్రేమ వ్యవహారం తెలుసుకుని రవిని ఎలాగైనా తప్పించాలని ఆ రౌడీ కుట్ర పన్నుతాడు. మరో వైపు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న రవికి తన కలలు ఫలించే రోజు వస్తుంది. దర్శకుడు అవుతాడు. చచ్చీచెడ్డీ దర్శకుడు అయిన రవీ తొలి చిత్రానికి గుమ్మడికాయ కొట్టేరోజు జరిగిన సంఘటనకు రవి షాక్ తింటాడు. అది ఏంటి? ఆ తర్వాత రవి ఏం చేశాడు ? అన్నదే మిగిలి కథ.
కళాకారులు.. పాత్రల తీరు తెన్నులు... సినిమా పరిశ్రమ ఎలా ఉంటుంది.? ఎంబిఏ చదివిన ఓ వ్యక్తి దర్శకుడిగా అవ్వాలనుకున్న వైనం. ఇండస్ట్రీ పోకడ ఎలా ఉంది? అనే విషయాలను దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు. నిజ జీవితంలో తను అనుభవించిన పాత్ర కనుక అసిస్టెంట్‌గా ఉంటూ నిజ జీవితంలో హీరో అయ్యాడు రవితేజ. సినిమాలో మాత్రం దర్శకుడు అవ్వాలనే తపన. తను నమ్మిన సిద్ధాంతాన్నే నమ్ముకున్న పాత్రలో బాగా ఇమిడిపోయాడు.
కథానాయిక విషయానికి వస్తే శియ ముఖంలో నిఖిత ఛాయలు స్పష్టంగా కనిపించాయి. భార్యను హింసించి బతికే వ్యక్తి పాత్రలో కృష్ణభగవాన్ జీవించాడు. అసిస్టెంట్‌గా ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ.. వేణు మాధవ్ నటన అదరగొట్టేశాడు. మిగిలిన వారు ఫర్వాలేదనిపించారు.
పూరీ చిత్రాలంటేనే చక్కని సంగీతబాణీలను సమకూర్చుతాడని చక్రి ఈ చిత్రంతో మరోసారి నిరూపించాడు. సినిమాటోగ్రఫీ చిత్రానికే హైలెట్‌గా నిలుస్తుంది. సంభాషణల పరంగా డైలాగ్స్ బాగున్నాయి. ఫైట్స్ రామ్‌లక్ష్మణ్ కంపోజింగ్ కొత్తదనంగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సినీ పరిశ్రమను నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఇది బాగా నచ్చితీరుతుంది. ఇక మిగిలిన వారి పరిస్థితి ఎంటో కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|