యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం సినిమా చూద్దాం
అందమైన అబద్ధంలో చేదు నిజం
PC
ఇదొక రొటీన్ లవ్‌స్టోరీ. రవితేజ 'ఒకరాజు ఒకరాణి' కథను పోలి ఉంటుంది. పెద్దరాయుడు వంటి చిత్రాన్ని తీసిన రవిరాజా పినిశెట్టిని ఈ "అందమైన అబద్ధం" బోల్డా కొట్టించిందనే చెప్పాలి. రాజా, కామ్నజెఠ్మలానీ, నాగబాబు, ఎం.ఎస్, అలీ, నరేష్, వాణి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రామ్ పినిశెట్టి, దర్శకుడు: రవిరాజా పినిశెట్టి, సంగీతం: ఎం.ఎం. శ్రీలేఖ, నిర్మాతలు: పి.పి. రెడ్డి, కేశవరాజు, జె. రామమూర్తి.

కథ:
ప్రదీప్ (రాజా), వైష్ణవి (కామ్న) బ్యాంకాక్‌లో చదువుకుంటూ ప్రేమించుకుంటారు. రఘరామ్ (నాగబాబు) కామ్న తండ్రి. బ్యాంకాక్‌లో రఘరామ్ స్నేహితుడు నరేష్‌కు వీరి ప్రేమ సంగతి తెలిసి రఘరామ్‌కు చెబుతాడు. అసలు ప్రేమంటే ధ్వేషించే వ్యక్తి రఘరామ్. తన కుమార్తెను ప్రేమిస్తున్న వ్యక్తి హైదారాబాద్ వస్తే చంపేయమని కొంతమందిని రఘరామ్ పురమాయిస్తాడు.

హీరో ఎలా ఉంటాడో తెలుసుకునేందుకు, అతని ఫొటోను రఘరామ్‌కు నరేష్ మెయిల్ చేస్తాడు. కానీ ఈ విషయాన్ని గ్రహించిన ప్రదీప్ తన ఫొటో బదులు అలీ ఫొటో పెడతాడు. ఇక అలీ హైదరాబాద్‌లో కన్పించినప్పుడుల్లా దుండగులు తన్నడం ఆసుపత్రి పాలుకావడం అంతా కామెడీగా సాగుతుంది. ఇక ప్రదీప్ తన ప్రేమను పెద్దల అంగీకారంతో నెరవేర్చుకోవాలని రఘరామ్ ఇంటికి సాంప్రదాయంగా తన తల్లిదండ్రులతో వచ్చి అడుగుతాడు.

అంతా సవ్యంగా జరుగుతుంది. కరెక్ట్‌గా నిశ్చితార్థంనాడు.. బ్యాంకాక్ నుంచి నరేష్ వచ్చి... వైష్ణవిని లవ్ చేసింది వీడే.. అని చెబుతాడు. మధ్యలో మరో స్టోరీ నడుస్తుంది. వైష్ణవిని వ్యాపారరీత్యా రఘరామ్‌పై ఉన్న కక్షతో విలన్ కిడ్నాప్ చేస్తాడు. అనంతరం వైష్ణవిని ప్రదీప్ ఎలా రక్షించుకొని పెండ్లాడాడు అన్నది మిగిలిన సినిమా.

విశ్లేషణ:
ప్రేమకోసం సాగే ఇటువంటి కథలు బోలెడు. కానీ దర్శకుడు అందమైన అబద్ధం అనే టైటిల్ పెట్టి కాస్త వెరైటీగా తీయాలనుకున్నాడు. కొన్ని చోట్ల రాజా ఉదయ్‌కిరణ్‌ను గుర్తుకు తెస్తాడు. ఎం.ఎం.శ్రీలేఖ మ్యూజిక్ సోసోగానే ఉంది. కామెడీకూడా పెద్దగా లేని ఈ చిత్రాన్ని క్లాస్ ప్రేక్షకులు కాస్త కాలక్షేపానికి చూస్తారేమో... మిగిలిన వారిని ఈ కథ రంజింప చేయడం కష్టం.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కుబేరులు రివ్యూ
వినాయకుడు రివ్యూ
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
యువత రివ్యూ
కేక- రివ్యూ
ఆకట్టుకోని త్రీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
మలేషియా నుంచి తిరిగివచ్చిన పులి
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోన్న చిత్రం "పులి". శ్రీ కనకరత్న మూవీస్ ప్రైవేట్...
మరో చరిత్ర సీక్వెల్‌కు సన్నాహాలు
యు అండ్ ఐ షూటింగ్ ప్రారంభం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...