యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం సినిమా చూద్దాం
కుబేరులు రివ్యూ
Kuberulu Still
PC
దొంగిలించబడిన నిజాం నగలను చేజిక్కించుకోవాలని చూసే ముగ్గురు వ్యక్తుల కథ. కామెడీకోసమే కథలు రాసుకునే శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించిన చిత్రమిది. ఆయన గతంలోచేసిన టాటాబిర్లా మధ్యలోలైలా, యమగోల మళ్ళీమొదలైంది, మ్మనబ్రదర్స్ చందనాసిస్టర్స్ తరహాలోనే రూపొందిన ఈ చిత్రంలో నిధికోసం వెతికే గందరగోళం మినహా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేమిలేదు.

శివాజీ, అలీ, కృష్ణభగవాన్, ఫర్జానా, కౌష, జీవా, ఎం.ఎస్. నారాయణ, ఎల్.బి. శ్రీరామ్, సుమన్‌శెట్టి, నర్సింగ్‌యాదవ్, కవిత, తెలంగాణా శకుంతల, జ్యోతిలక్ష్మి, తస్లీమా తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. గోదావరి టాకీస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి కెమెరా: రామ్‌పినిశెట్టి, అరుణ్‌కుమార్, విజయ్‌కుమార్, మాటలు: దాసరి బ్రహ్మం, సంగీతం: జీవన్‌థామస్, ఎడిటింగ్: నాగిరెడ్డి, ఆర్ట్: సాయి, నిర్మాతలు: కరుటూరి శ్రీనివాస్, యాగంటి శ్రీనివాస్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి.

కథ:
నిజాం కాలంనాటి నగలు చోరీకావడంతో కథ మొదలవుతుంది. వాటిని దుండగుడు ఓ రహస్య ప్రాంతంలో పాతిపెడతాడు. కానీ పోలీసులు తరుముకురావడంతో, ఈ విషయాన్ని తనవారికి ఫోన్‌లో చెప్పి తప్పించుకునే క్రమంలో తుపాకీ తూటాకు బలి అవతాడు. ఈ విషయాన్ని తరువాతి రోజు పేపర్లో చదవి తెలుసుకున్న రాంబాబు (కృష్ణభగవాన్) వాటిని చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు మొదలు పెడతాడు.

మరోవైపు.. పరుచూరి శివరామ్ (శివాజీ)కి ముఖ్యమంత్రి వై.ఎస్ అంటే వల్లమాలిన అభిమానం. ఆయనలాగే తన ఊరికి తాను ఏదో చేయాలన్న తపనతో పంచాయితీ ఎన్నికల్లో నిలబడతాడు. ప్రజలకు ఇల్లుకట్టించాలనుకుని మోసపోతాడు. దాంతో తన స్నేహితుడైన అలీతో సిటీకి వస్తాడు. అక్కడ వారి స్నేహితుడైన రాంబాబుతో కలిసి దొంగిలించిన నగలకోసం వేట మొదలెడతారు. దొంగలించిన వ్యక్తి వివేకానంద నగర్ కాలనీలో ఓ ఇంట్లో ఆ నగలను దాచిపెడతాడు.

ఆ కాలనీలోనే ఈ ముగ్గురు ఉంటారుకానీ, వీటి కోసం ఊరంతా వెతుకుతుంటారు. సెల్‌ఫోన్ ద్వారా ఆరాతీస్తే, ఇది డాక్డర్ కల్పన (ఫర్జానా)దని తెలుస్తుంది. దీంతో చనిపోయిన దొంగ అన్న డాక్టర్ శివప్రసాద్ ఆమె తమ్ముడ్ని కిడ్నాప్ చేస్తాడు. మరి ఆఖరికి నగలు ఏమయ్యాయి... కిడ్నాప్ కథ ఏమయింది... అనేది మిగిలిన సినిమా.

విశ్లేషణ:
నిధి దొంగిలించడం, దాన్ని దక్కించుకోవాలని చూడడం వంటి అంశాలు పాతవే అయినా, దీనిలో కొత్తదనంతో చూపించే క్రమంలో లని కాస్త దర్శకుడు గందరగోళానికి గురి చేశాడు. ఇంకా దీనిపై సరైన హోమ్‌వర్క్‌చేస్తే మాస్‌ను బాగా ఆకట్టుకునేవాడు. ముఖ్యంగా ప్రత్యేక పాటలో జ్యోతిలక్ష్మి డాన్స్ బాగానే ఉంది. జీవన్‌థామస్ సంగీతం పర్వాలేదు. 'గాల్లో తేలినట్లుందే...' "చూపల్తో గుచ్చిగుచ్చి చంపకే మేరే హాయ్", "గుడివెనుక నా సామి" వంటి రీమిక్స్‌ పాటలు బాగానే ఉన్నాయి. మొత్తం మీద సినిమా కాలక్షేపం చేసేందుకు బాగా ఉపయోగపడుతుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వినాయకుడు రివ్యూ
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
యువత రివ్యూ
కేక- రివ్యూ
ఆకట్టుకోని త్రీ
మనిషి ఆశలకు రూపం... నిన్న నేడు రేపు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
మలేషియా నుంచి తిరిగివచ్చిన పులి
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోన్న చిత్రం "పులి". శ్రీ కనకరత్న మూవీస్ ప్రైవేట్...
మరో చరిత్ర సీక్వెల్‌కు సన్నాహాలు
యు అండ్ ఐ షూటింగ్ ప్రారంభం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...