|
| వినాయకుడు రివ్యూ |
"హ్యాపీడేస్" చిత్రంలో నటీనటుల్లో చాలామంది ఇటీవల హీరోలు, హీరోయిన్లుగా మారారు. ఆ సినిమాలో నటించిన సోనియా "వినాయకుడు"లో హీరోయిన్. శేఖర్‌కమ్ముల దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన సాయికిరణ్ అడవి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. కథలు ఎక్కడి నుంచో పుట్టవు. మన చుట్టూ ఉండే సమాజంలోంచే పుడతాయనేదానికి "వినాయకుడు" నిదర్శనం.
మనస్సు నిర్మలంగా ఉండటమే అసలైన అందమని చెప్పే సందేశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఎక్కువభాగం రామోజీ ఫిలింసిటీ, జూబ్లీహిల్స్ రోడ్లపై చిత్రించిన ఈ సినిమాలో కృష్ణుడు, సోనియా, పూనమ్‌కౌర్, సూర్యతేజ్, జ్యోతి, ఆదర్శ్, మురళీకృష్ణ తదితరులు ప్రధాన తారాగణం. నిర్మాత: సరిత పట్రా. ఈ సినిమా శుక్రవారం ఓవర్‌సీస్‌లో విడుదలకాగా, రేపు (నవంబరు 22) ఆంధ్రప్రదేశ్‌లో విడుదల కానుంది.
కథ: వినాయకుడిలాగా ఉండే వ్యక్తి నాజుగ్గా ఉండే భామ ప్రేమను కోరుకోవడం తప్పా.. ఒప్పా... అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. కథలోకి వెళితే.. సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగ నిమిత్తం సొంత ఊరు నుంచి హైదరాబాద్ వస్తాడు కార్తీక్ (కృష్ణుడు). తన అక్క ఇంటిలో మకాం వేస్తాడు. ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీలోనే కల్పన (సోనియా) సీనియర్. తన తయారు చేసిన యాడ్‌లను అందరూ ప్రశంసిస్తుంటే, కృష్ణుడు మాత్రం లాజిక్కుతో ప్రశ్నిస్తాడు.
అప్పటికే కృష్ణుడుతో కల్పనకు ఉన్న విభేదాలు ఈ వ్యవహారంతో మరింత ముదురుతాయి. మరోవైపు కల్పన తల్లిదండ్రులు మరో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తుండే కుర్రాడితో తమ కుమార్తె పెళ్లి చేయాలనుకుంటారు. వారు ఈ వివరాలను కల్పనకు చెప్పడంతో వారిద్దరూ మనసు విప్పి మాట్లాడుకోవడం మొదలుపెడతారు. ఈ క్రమంలో ఒక అర్ధరాత్రి జంటగా ఉన్న వీరిద్దరినీ చూసి ఎస్ఐ నిలదీస్తాడు. కల్పనపై వ్యభిచారిణి నింద మోపుతాడు.
అయితే గొడవను పెద్దది చేయడం ఇష్టం లేక కల్పన స్నేహితుడు ఎస్ఐకి వెయ్యి రూపాయాలు ఇచ్చి మేనేజ్ చేస్తాడు. తనను బజారు మనిషిగా నిందించిన ఎస్ఐని నిలదీయకపోగా, లంచం ఇచ్చినందుకు అతినిపై కల్పనకు ఏహ్యభావం ఏర్పడుతుంది. అనంతరం అతనికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటుంది.
ఇదిలా ఉంటే తొలి చూపులోనే కల్పనపై మనసు పారేసుకున్న కృష్ణుడు ఈ విషయం తెలిసి సంబరపడిపోతాడు. తన ప్రేమ విషయాన్ని ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతుంటే కృష్ణుడు స్నేహితుడు ఆ బాధ్యత తీసుకుంటాడు. కానీ ఈ విషయం బెడిసికొట్టి అసలుకే మోసం వస్తుంది. మరి ఆ తర్వాత ఏమైంది... కృష్ణుడు ఏం చేశాడు... కల్పన తల్లిదండ్రులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు.. అనేది మిగిలిన సినిమా.
విశ్లేషణ: సినిమా మొదటి భాగం సరదాగా సాగిపోతుంది. రెండో భాగంలోనే కథ మొత్తం ఇమిడి ఉంది. పాటలు ఉన్నా, కథనంలో కనుమరుగవతాయి. ముఖ్యంగా సినిమాకు కృష్ణుడు పాత్రే కీలకం. అసలు అతని గురించే ఈ సినిమా తీశారు. యువ సీరియల్‌లోనూ, పలు చిత్రాల్లో నటించిన కృష్ణుడు పూర్తిస్థాయి హీరోగా నటించిన చిత్రమిది. తన నటన, హవాభావాలతో హాస్యాన్ని పండించగలిగాడు. కథలో ప్రత్యేకమైన కామిడీ ట్రాక్ లేకపోయినా, కృష్ణుడు, అతని స్నేహితులు చేసే విన్యాసాలే రక్తికట్టిస్తాయి.
కల్పన పాత్రలో సోనియా సరిపోయింది. ఇప్పటికే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులపై అనేక చిత్రాలు వచ్చాయి. అక్కడ ఉద్యోగుల ప్రవర్తన, వీకెండ్ పార్టీలు ఏలా ఉంటాయో జుగుప్సాకరం లేకుండా దర్శకుడు "వినాయకుడు"లో చక్కగా మలిచాడు. సోనియా స్నేహితురాలిగా పూనమ్ కౌర్ మెప్పించింది. అభియోగం మోపబడి ఉద్యోగం కోల్పోయి, మళ్లీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పొందే తనకిష్టమొచ్చినట్లు ఏంజాయ్ చేసే పాత్రను ఆమె పోషించింది. హైటెక్ కల్చర్‌లో ఉండే రకరకాల వ్యక్తిత్వాలను బాగా చూపించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|