|
| ఆవకాయ్ బిర్యానీ రివ్యూ |
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం టైటిల్ పెట్టి తీసిన హిందూ- ముస్లిం ప్రేమకథే "ఆవకాయ్ బిర్యాని". మాల్గుడి కథలు తరహాలో దర్శకుడు ఓ చిన్న పాయింట్ తీసుకుని ఈ సినిమా తీశారు. సినిమా అనే కన్నా డాక్యుమెంటరీ అంటే సరిగా ఉంటుందేమో. కమల్ కామరాజు, బింధు మాధవి, రావ్ రమేష్ తదితరులు నటించిన ఈ సినిమాకు అనీష్ కురివిల్లా దర్శకుడు. శేఖర్ కమ్ముల, చంద్రశేఖర్ కమ్ముల నిర్మాతలు.
కథ: అక్బర్ (కమల్ కామరాజు) దేవరకొండ అనే గ్రామంలో ఆటోడ్రైవర్. పాలప్యాకెట్లు, పేపర్లు సైకిల్‌పై వేస్తూ దినచర్య ప్రారంభిస్తాడు. అతనొక అనాథ. ఒక ముస్లిం వ్యక్తి అక్బర్‌ను పెంచుకుంటాడు. చదువులో అక్బర్ కాస్త పూర్. ఎలాగో డిగ్రీదాకా వచ్చి మూడుసార్లు తప్పుతాడు. పగలంతా ఆ ఊరిలో ఆటోడ్రైవర్‌గా ఉంటూ... రాత్రిళ్లు బి.కామ్ కోసం కుస్తీపడుతుంటాడు. ఊరిపెద్ద మాస్టార్జీ (రామ్ రమేష్) ఆటో ఓనర్. ఇదిలా ఉంటే ఆ ఊరిలో సాంప్రదాయాలకు పెద్దపీట వేసే బ్రాహ్మణ కుటుంబం దిగుతుంది. హోటల్ పెట్టి ఆవకాయ పచ్చళ్ల వ్యాపారం చేయాలనుకుంటాడు ఆ ఇంటిపెద్ద.
ఆయన కూతురే లక్ష్మి (బింధు మాధవి). తనే స్వయంగా ఆవకాయపచ్చళ్లు తీసుకుని వెళ్లి సిటీలో తిరిగినా అమ్ముడు పోవు. మరోవైపు ఆ ఊరిలో కరెంటు, నీరు వంటి సరైన సదుపాయాలు లేకపోయినా... తిట్టుకుంటూ కాలం గడుపుతారు ఆ ఊరి ప్రజలు. ఓ రోజు మాస్టార్జీ.. తమ ఊరికి ముఖ్యమంత్రి వస్తున్నారంటూ ఊరివారిచేత శ్రమదానం చేయిస్తాడు. ముఖ్యమంత్రి వచ్చి సుందరంగా ఉన్న దేవరకొండను పర్యాటక కేంద్రంగా మారుస్తానని ప్రకటిస్తాడు. అందరూ చప్పట్లు కొట్టి ఊరుకుంటే... అక్బర్ లేచి ఊరి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళతాడు.
ఈ పరిణామానికి ఊరిపెద్ద ఆగ్రహించి తనను అవమానపర్చినందుకు అక్బర్‌ను ఊరి నుంచి వెలివేస్తాడు. తెల్లవారితే ఊరు వదలి వెళ్లిపోవాల్సిన తరుణంలో... ముఖ్యమంత్రి ఆదేశాలతో ఊరికి రోడ్లు, మంచినీటి వసతులు కల్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తుంటారు. దీంతో ఊరంతా అక్బర్‌కు జిందాబాద్ కొడుతుంది. ఇక చేసేదేమీ లేక అక్బర్‌ను ఇక్కడే ఉండమని ఊరిపెద్ద అంటాడు. కానీ ఎలాగైనా అక్బర్‌ను వదిలించుకోవాలని, ఊరిపెద్ద ఓ ప్లాన్ వేస్తాడు. బిందు అక్బర్‌తో చనువుగా ఉండడాన్ని అదే ఊరిలో ఉన్న మరో ముస్లిం సహించలేకపోతాడు.
దాన్ని సాకుగా తీసుకుని అక్బర్‌పైకి అతడిని ఊరిపెద్ద ఉసిగొలుపుతాడు. ఆటోరేస్‌లో ఓడిపోయిన వారు... ఊరు వదిలి వెళ్లిపోవాలని పందెం వేసుకుంటారు. దీనికి ఇద్దరూ సమ్మతించి ఆటోరేస్‌లో పాల్గొంటారు. ఆ రేస్‌లో ఎవరు గెలిచారు.... ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి... మరి బిందు ఆవకాయ పచ్చడి వ్యాపారం ఏమైంది... బిందు తండ్రి అక్బర్ ప్రేమను అంగీకరించాడా... లేదా... అన్నది మిగిలిన కథ.
విశ్లేషణ: కమల్ కామరాజు కొత్తయినా కొన్ని సన్నివేశాల్లో బాగా నటించాడు. ఎమోషనల్ ఫీలింగ్స్‌ను మాత్రం పలికించలేకపోయాడు. నటనను ఇంకా మెరుగుపర్చుకోవాలి. బిందు పరిస్థితి కూడా ఇదే. మిగిలిన పాత్రల్లో నటించినవారు కూడా కొత్తవారే. సంగీత పరంగా మణికాంత్ కద్రి బాణీలు బాగున్నాయి. ఆరంభంలో వచ్చిన రెండు నేపథ్య గీతాలు మెలడీతో శ్రోతలను ఆకట్టుకున్నాయి. చిత్రంలో ప్రత్యేకంగా చెప్పాల్సింది శ్యామ్ సినిమాటోగ్రఫీ. చాలా బాగుంది. అనీష్ కురువిల్లా... ఒక ఇరానీ ఫిలింను బేస్‌గా చేసుకుని చిన్న పాయింట్‌తో తీసిన చిత్రమిది. టేకింగ్‌లో వర్మ ఛాయలు కన్పించినా సన్నివేశాలను హత్తుకునేలా తీయలేకపోయారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|